జీవో నంబర్ 159: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చెక్- జనవరి 21 నుంచే..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త హాజరు నిబంధన ప్రవేశపెట్టింది. జనవరి 21వ తేదీ నుంచి అమలులోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేపటి కిందటే వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి జీవో నంబర్ 159ను జారీ చేశారు.

అటెండెన్స్ బై ఫొటోగ్రఫీ..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫేసియల్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అటెండెన్స్ బై ఫొటోగ్రఫీ గా దీనికి పేరు పెట్టింది. రెండు విడతల్లో ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనుంది జగన్ సర్కార్. ఈ తరహా వ్యవస్థ ఇదివరకెప్పుడూ లేదు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీన్ని అనుసరించట్లేదనే తెలుస్తోంది.

అమలు ఎలా..?
రెండు విడతల్లో ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనుంది జగన్ సర్కార్. తొలి విడతలో జనవరి 1వ తేదీన సచివాలయం పరిధిలో ఈ ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ను ఉద్యోగుల కోసం అందుబాటులోకి తీసుకుని రానుంది. రెండో విడతలో భాగంగా జనవరి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన విభాగాధిపతులు, అటానమస్ ఆర్గనైజేషన్స్, అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో అమల్లోకి తీసుకుని రానుంది.

ఉద్దేశం ఏంటీ?
బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే విషయంపై ఈ జీవో నంబర్ 159లో పొందు పరిచింది ప్రభుత్వం. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా, నిర్దుష్ట సమయానికి సరైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని అమలు చేయాల్సి వచ్చిందని వివరించింది. గ్రామస్థాయిలో పరిపాలన సజావుగా సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఉద్యోగులందరూ సమయపాలనను పాటించేలా చేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని స్పష్టం చేసింది.

ఎక్కడెక్కడ..?
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అంటే- రాష్ట్రస్థాయి సచివాలయం, అన్ని అటానమస్, రీజినల్, డివిజినల్, జిల్లా కార్యాలయాలు, స్థానిక సంస్థలు, మండల-గ్రామస్థాయి ఆఫీసులు, గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ ఫేసియల్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రానుంది ప్రభుత్వం. కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులను నిర్వర్తించే ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కూడా దీన్ని వర్తింపజేసింది.

ఉద్యోగులు ఏమంటున్నారు..?
ఈ తరహా విధానాన్ని ఇదివరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. ఆ తరువాత వెనుకంజ వేసింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి మొదలుకుని గ్రామ/వార్డు సచివాలయాల వరకు అమలు చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ పట్ల ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తమను ఇబ్బందులకు గురి చేయడానికే ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టదలిచిందని అంటున్నారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565











Click it and Unblock the Notifications