ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్- ఉత్పత్తికి అనుమతి ఇచ్చిన సర్కార్...
ఏపీలో మే 4వ తేదీ నుంచి మద్యం షాపులను తిరిగి ప్రారంభించేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం ఈ మేరకు ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా డిస్టిలరీలకు అనుమతి ఇచ్చింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని ఆంక్షలు విధించింది. ఈ మేరకు డిస్టిలరీలకు ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా మద్యం తయారీకి వీలుగా డిస్టిరీలకు అనుమతులు ఇచ్చింది. అయితే తాము విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 డిస్టిలరీలు కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిగా శానిటైజ్ చేయాలని ఆదేశించింది. మద్యం తయారీ సమయాల్లో కార్మికులు సామాజిక దూరం పాటించాలని, తయారీ కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు వేర్వేరుగా ఉండాలని సూచించింది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరెట్ ను నిషేధించింది. అలాగే కార్మికులు లిఫ్టులను కూడా వాడొద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications