ఆ నిర్ణయం వాయిదా, ఇలా చేద్దాం- ఏపీ ప్రభుత్వం తాజా ప్లాన్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయ లెక్కలు మారుతున్నాయి. పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. అధికార వైసీపీ పాలనా పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ పరంగా కేడర్ ను ప్రజల్లోకి పంపిన సీఎం జగన్ వరుస నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. ఈ సమయంలోనే కుల గణనకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని తొలుత నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.
ప్రభుత్వం తాజా నిర్ణయం:ఏపీలో ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీంతో, ఇక ఇంటింటికి వెళ్లి సిబ్బంది 20 అంశాలకు సంబంధించి సమాచారం సేకరించేలా కార్యాచరణ సిద్దం చేసింది. కానీ, ఇప్పుడు ఈ నిర్ణయం వాయిదా వేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో పాటుగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో, కులగణన కార్యక్రమాన్ని డిసెంబర్ 10వ తేదీ వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం అందింది.

డిసెంబర్ 10న ప్రారంభం:రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాల్లో సవరణ చేసింది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు పూర్తి చేసింది. డిసెంబర్ 3 నాటికి సర్వే పూర్తి చేయాలని భావించింది. కానీ, ఇప్పటికే ప్రారంభమైన కార్యక్రమాల్లో అవాంతరాలు రాకుండా తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు కుల గణన సర్వేలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాల పై సమాచారం సేకరిస్తారు. వాలంటీర్లు ఇళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నా..కుటుంబ సభ్యులు ఇళ్ల దగ్గర లేకపోయినా అలాంటి వారి వివరాల నమోదు కోసం సర్వే పూర్తయిన తరువాత మరో వారం గడువు ఇవ్వనున్నారు.
మార్గదర్శకాలు జారీ:ఈ సమయంలో సంబంధిత కుటుంబసభ్యులే సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాలి. కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ ఫోన్ లో ప్రత్యేక యాప్ పొందుపరిచారు. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీరు ఒకే సెల్ ఫోన్ ను వినియోగించాలి. వివరాలు సేకరించేటప్పుడు గానీ, పూర్తి అయిన తరువాత గానీ, స్క్రీన్ షాట్ లేదా వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలు లేకుండా యాప్ ను డిజైన్ చేసారు. సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, వివాహ వివరాలు, కులం, ఉపకులం, మతం, రేషన్ కార్డు నంబర్, విద్యార్హత, ఇంటి వివరాలు, వంట గ్యాస్ తో పాటుగా ఉపాధికి సంబంధించిన వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు డిసెంబర్ 10వ తేదీ నుంచ కులగణన ప్రారంభం కానుంి.
-
నిరుద్యోగులకు ఉగాది కానుక, 10వేల ఉద్యోగాలు భర్తీ- ఏ శాఖలో ఎన్ని..!! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
Half-Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు-ఎప్పటి నుంచి అంటే ? టైమింగ్స్ ఇవే..! -
రైతులకు శుభవార్త: ఏపీలో రేపటి నుండి "రైతన్న మీ కోసం".. చంద్రబాబు ఆదేశం! -
ప్రభుత్వ ఆస్పత్రులలోనూ వాట్సప్ ద్వారా ఓపీ అపాయింట్మెంట్లు.. పేదలకు చంద్రబాబు శుభవార్త! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
పీఎం కిసాన్ నిధులు జమ కాలేదా - అయితే, ఇలా చేస్తే వెంటనే..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్












Click it and Unblock the Notifications