ఏపీలో మరో 535 మద్యం షాపుల తగ్గింపు - నేటి నుంచే అమల్లోకి...

ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులేస్తున్న ఏపీ సర్కార్ ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని 535 మద్యం షాపులను మూసేస్తోంది. గతేడాది అధికారం చేపట్టిన తర్వాత మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్న సర్కారు... వాటిలో 20 శాతం మూసేసింది. ఈ ఏడాది మరో 13 శాతం దుకాణాలను మూసేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 535 దుకాణాలు మూతపడుతున్నాయి.

నిన్నటి వరకూ రాష్ట్ర్లంలో 3500 మద్యం షాపులు పనిచేస్తుండగా.... ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ్టి నుంచి 2965 మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 535 మూతపడతాయి. అదే సమయంలో గతేడాది అధికారంలోకి వచ్చాక 40 శాతం బార్లను మూసేసిన వైసీపీ సర్కారు.. ఈ ఏడాది మరికొన్నింటిని మూసేసేందుకు సిద్ధమవుతోంది.

ap govt reduces 535 more liquor shops from today as a part of prohibition

ఈ వ్యవహారంలో లైసెన్స్ గడువున్న కొందరు బార్ల యజమానులు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అయినా కోర్టుల్లో న్యాయపోరాటం కొనసాగించడం ద్వారా బార్లను కూడా మూసేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Recommended Video

    COVID-19 Cases Crossed 3045 Mark In AP, 98 New Cases Registered In 24Hrs

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+