El Nino: ఎల్ నినోపై జగన్ కు సర్కార్ కౌంటర్..! వర్షాల్లేకపోయినా ఖరీఫ్ సాగు..!

ఎల్ నినో (El Nino) పరిస్ధితుల్ని ఎదుర్కోవడంలో కూటమి సర్కార్ (AP Govt) విఫలమైందన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Ys jagan) విమర్శల్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 20.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు, పప్పుధాన్యాల సాగులో 23.6 శాతం వృద్ధి సాధించినట్లు ఆయన వెల్లడించారు. పంటల బీమా పరిధి 108 శాతం పెరిగిందని మంత్రి గుర్తుచేశారు. రైతుల కోసం ఇంతటి ముందస్తు ప్రణాళిక జగన్‌ పాలనలో ఎక్కడుందని ప్రశ్నించారు.

El Nino: పసిఫిక్ లో మొదలైన ఎఫెక్ట్-డిసెంబర్ కల్లా తీవ్ర రూపం ? తాజా రిపోర్ట్..!
El Nino: పసిఫిక్ లో మొదలైన ఎఫెక్ట్-డిసెంబర్ కల్లా తీవ్ర రూపం ? తాజా రిపోర్ట్..!

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్‌ సాగుకు ఎక్కడా విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు చేపట్టిందని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటే, వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలు చేయడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తగదన్నారు. రైతుల గురించి మాట్లాడే ముందు జగన్‌ తన ఐదేళ్ల పాలనను ఒకసారి గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.

AP Govt Rejects Jagan s El Nino Charge Says Kharif Farming Continues Despite Rainfall Deficit
AP El Nino: ఎల్ నినో తీవ్రం.! ఇక నీళ్లూ కష్టమే- అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్..!
AP El Nino: ఎల్ నినో తీవ్రం.! ఇక నీళ్లూ కష్టమే- అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్..!

జూన్‌ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో 192.8 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఇదే కాలానికి సాధారణ వర్షపాతం 393.7 మి.మీ. కాగా, సాధారణంతో పోలిస్తే 51 శాతం లోటు నమోదైందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పప్పుధాన్యాల సాగులో 23.6 శాతం వృద్ధి నమోదు కావడం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు నిదర్శనమని అన్నారు. గత ఏడాది ఆగస్టు 25 నాటికి పప్పుధాన్యాల సాగు 2.16 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది అదే తేదీ నాటికి 2.66 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపారు. పంటల వారీగా కంది 1.92 లక్షల హెక్టార్ల నుంచి 2.30 లక్షల హెక్టార్లకు, మినుము /బ్లాక్‌గ్రామ్‌ 0.17 లక్షల హెక్టార్ల నుంచి 0.30 లక్షల హెక్టార్లకు, పెసలు 0.041 లక్షల హెక్టార్ల నుంచి 0.061 లక్షల హెక్టార్లకు, సోయాబీన్‌ 0.048 లక్షల హెక్టార్ల నుంచి 0.100 లక్షల హెక్టార్లకు పెరిగినట్లు మంత్రి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+