అమరావతిపై బిగ్ డెసిషన్ - గేమ్ ఛేంజర్..!!
ఏపీ రాజధాని అమరావతి పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి కేంద్రంగా పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. సగం లో ఆగిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిర్ణయించింది. అటు ప్రపంచ బ్యాంకు నుంచి ఈ నెల లోనే రుణం మంజూరు కానుంది. ఇదే సమయంలో నిర్మాణాల కోసం టెండర్లు ఖరారు చేసి .. వ్చే నెలలో పనులు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్దం చేసారు. ఈ క్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం తాజాగా అమరావతికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో
రాజధాని అమరావతి నిర్మాణం లో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. మధ్యలో నిలిచిన పనులను తిరిగి పునరుద్దరించేందుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 పనులకు ఆమోద ముద్ర వేసిన సీఆర్డీఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో, ప్రభుత్వం తాజాగా ఈ పనుల కోసం 11 వేల 467 కోట్ల రూపాయలకు సర్కార్ పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నిర్మాణాల కోసం టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించాలని ప్రభుత్వ భావిస్తోంది.

వాటికి ప్రాధాన్యత
మధ్యలో నిలిచిన పనుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, సివిల్స్ అధికారుల క్వార్టర్లు ఉన్నాయి. ఇక, ఇప్పటికే సీఆర్డీఏ భవనం నిర్మాణానికి సంబంధించి డిజైన్ పైన ప్రజాభిప్రాయం కోరారు. తాజాగా ఈ గడవు మరో 20 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఆర్‌డీఏ ప్రాజెక్టు ఆఫీసు బిల్డింగు ఎలా ఉండాలనే దానిపై వెబ్సైట్ ద్వారా చేపట్టే పోలింగ్ నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించారు. ఇప్పుడు డిసెంబర్ 14 తేదీ వరకూ ఓటింగ్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఓటింగ్ కోసం ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. దీంతో, గడువు పెంచటం ద్వారా మరింత మందికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
నిర్మాణాలు షురూ
సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం కోసం పది డిజైన్లు ఖరారు చేసి ప్రజాభిప్రాయం కోరారు. ఇప్పటికే కేంద్రం అమరావతి నుంచి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ నిధులకు అంగీకరించింది. దీంతో, వచ్చే నెల నుంచి పనుల ను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇక..అమరావతి కోసం గతం లో పని చేసిన సింగపూర్ ప్రభుత్వంతో తిరిగి కలిసి పని చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తాజాగా కేంద్రాన్ని కోరింది. ఇప్పుడు నిర్మాణాలను పాలనా పరమైన అనుమతి రావటంతో ఇక అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications