ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ కీలక ఆదేశాలు: ఈ కార్పోరేషన్లలో పునర్విభజన..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నిర్ణయించారు. వచ్చే నెలలో మున్సిపల్ పోరు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కోర్టులో కేసు పరిష్కారం కావటంతో.. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనల ను పంపాల్సిందిగా కార్పోరేషన్లను ఆదేశించారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తరువాత షెడ్యూల్ విడుదల కానుంది.

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. మున్సిపల్ కార్పోరేషన్లలో వార్డుల పునర్విభజన షెడ్యూల్ ఫిక్స్ అయింది. షెడ్యూల్ ప్రకారం.. రేపటి నుంచి 11వ తేదీ వరకు ఏడు రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈనెల 12వ తేదీన మున్సిపల్ కార్పోరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్‌కు సమర్పించాలని అధికారులు ఆదేశించారు. 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్‌లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కలు ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు.

 స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా - చంద్రబాబు నిర్దేశం..!!
స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా - చంద్రబాబు నిర్దేశం..!!
ap-govt-releases-schedule-for-wards-re-organisation-in-municipal-corporations-here-the-list

ప్రభుత్వం తాజా ఆదేశాలతో

ఈ ప్రక్రియలో భాగంగా కార్పొరేషన్ల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి, నిర్ణీత గడువులో తుది డీలిమిటేషన్‌ను ప్రకటించనున్నారు. కార్పొరేషన్లు సమర్పించే వార్డుల పునర్విభజన ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు ఏడు రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు షెడ్యూల్‌లో అవకాశం కల్పించారు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నారు. అభ్యంతరాలు, సూచనల స్వీకరణ ప్రక్రియ పూర్తైన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్లు తుది ప్రతిపాదనలను సిద్ధం చేయాలి. సెప్టెంబర్ 12న ఈ తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్‌కు సమర్పించాలని అధికారులు ఆదేశించారు.
సెప్టెంబర్ 14న ఏపీ గెజిట్‌లో వార్డుల డీలిమిటేషన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+