వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి దిగుతా, మీ థియరీ ప్రకారం: అమరావతి టు పింక్ డైమండ్.. బాబును దులిపేసిన పవన్, హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు పై పవన్ వరుస ట్వీట్లు

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం వరుస ట్వీట్లు చేశారు. పలు అంశాలపై ఆయన సమాజిక అనుసంధాన వేదికలో స్పందించారు. పవన్ కళ్యాణ్ రంజాన్ పర్వదినం సందర్భంగా తన జనసేన పోరాట యాత్రకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

'పరకాలా! ముద్దాయి మాటలు పట్టించుకోకు, రిజైన్‌కు బాబు నో!': జగన్ ఏమన్నారు, ఆయన వల్లేనా?'పరకాలా! ముద్దాయి మాటలు పట్టించుకోకు, రిజైన్‌కు బాబు నో!': జగన్ ఏమన్నారు, ఆయన వల్లేనా?

భూములను రక్షించాల్సిన ప్రభుత్వం భూకబ్జాలకు అండగా ఉంటోందని ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి భూములపైనా స్పందించారు. అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే సరిపడా భూముల్ని సమీకరించినందున భూసేకరణ చట్టం ప్రయోగిస్తే తాను పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

అమరావతిపై మళ్లీ రంగంలోకి పవన్ కళ్యాణ్

ఈ విషయమై తాను అమరావతి ప్రాంతంలోని రైతులతో సమావేశం కానున్నట్లు పవన్ వెల్లడించారు. ఈ నెల 23న పవన్ విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అప్పుడే ఆయన వారితో భేటీ అయ్యా ఆస్కారం ఉంది. పవన్ 23, 24, 25 తేదీలలో విజయవాడలో ఉంటారు. పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులతో పాటు రైతులతోను భేటీ కానున్నారని ఆయన వ్యాఖ్యలతో తెలుస్తోంది.

పవన్ తీవ్ర వ్యాఖ్యలు

అమరావతి రైతులు, భూసేకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాలకు రక్షకులుగా ఉండాలని, కానీ దోచుకునేవారుగా ఉండవద్దని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఐనా హక్కుల కోసం పోరాడుతున్నారు

హింసాకాండ రాజకీయ నాయకత్వం ఉత్తరాంధ్ర పోరాట స్ఫూర్తిని అణగదొక్కలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ పోరాటంలో ఓ రైతుకు బుల్లెట్ తగిలిందని, అయినప్పటికీ ఆయన తన హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పారు.

నాయీ బ్రాహ్మణుల అంశంపై పవన్

మనము నేతలను ప్రేమతో ఎన్నుకున్నామని, వారు మనలను భయపెట్టి పాలిస్తున్నారని పవన్ కళ్యాణ్.. చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఇటీవల నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు. నా బ్రాహ్మణులకు నా మద్దతు ఉంటుందని తెలిపారు. వారి డిమాండ్లను సానుకూలంగా చూస్తున్నామని, వారికి మద్దతిస్తున్నామని చెప్పారు.

రమణదీక్షితులు ఆరోపణలపై సమాధానం సంతృప్తికరంగా లేదు

శ్రీవారికి చెందిన పింక్ డైమాండ్ నుంచి ఇతర ఆభరణాలు ఎన్నో అదృశ్యమయ్యాయని రమణదీక్షితులు చెప్పారని, వాటిపై ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. ఫోరెన్సిక్ నిపుణులతో ఆ సీన్‌ను మళ్లీ ఎందుకు క్రియేట్ చేయడం లేదని ప్రశ్నించారు. భక్తులు విసిరిన నాణేల కారణంగా అదృశ్యమైందని చెప్పిన విషయాన్ని కూడా ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వం థియరీ ప్రకారం..

ఏపీ ప్రభుత్వం థియరీ ప్రకారం..

శ్రీవెంకటేశ్వర స్వామి పింక్ డైమాండ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన మిస్సింగ్ థియరీపై పవన్ సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వం థియరీ ప్రకారం ఎక్కడైనా దేవుళ్ల ఊరేగింపు జరుగుతుంటే ఎవరైనా నాణేలు విసిరి విగ్రహంలోని ఖరీదైన జ్యువెల్లరీని వేరు చేయవచ్చునన్నారు. అలాగే, ఇతర ఆభరణాల మాటేమిటని ప్రశ్నించారు.

English summary
I request GOVT of AP not to use Land acquisition act on Amaravati Farmers. Govt has pooled enough land for capital & should stop acquiring further.I will be meeting farmers in Amaravati regarding this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X