ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు-త్వరలో జారీ..!
ఏపీలో వాహనదారులకు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence), రిజిస్ట్రేషన్ల సర్టిఫికెట్ (Registration Certificate)ల విషయంలో ప్రభుత్వం (AP GOVT) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల్ని వాహనదారులకు జారీ చేస్తుండగా.. వాటి స్ధానంలో తక్కువ ఖర్చుతో మరో మార్పు తీసుకొస్తున్నారు. ఇది వెంటనే అమల్లోకి రాబోతోంది. దీంతో గతంలో జారీ అయిన కార్డుల స్ధానంలో వీటిని తీసుకునే అవకాశం కల్పించడంతో పాటు కొత్త కార్డుల్ని సైతం ఇదే విధానంలో జారీ చేయబోతున్నారు.
చిప్ స్దానంలో క్యూఆర్ కోడ్ కాార్డులు (Ap Govt)
కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు జారీ చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)కార్డులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాసయిన తర్వాత జారీ చేసే స్మార్ట్ కార్డుల్ని గతంలో చిప్ ఆధారిత వ్యవస్ధలోకి మార్చారు. దీంతో ఈ స్మార్ట్ కార్డులపై చిప్ కనిపించేది. ఇందులోనే సదరు కార్డుకు సంబంధించిన డేటా అంటే స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు చిప్ స్ధానంలో క్యూఆర్ కోడ్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి డబ్బులు ఆదా కాబోతున్నాయి.

డబ్బులిచ్చినా రాని కార్డులు
గతంలో తీసుకొచ్చిన చిప్ ఆధారిత విధానంలో ప్రతీ ఆర్సీ లేదా డీఎల్ స్మార్ట్ కార్డు కోసం రూ.200 ఫీజు, పోస్టల్ ఛార్జీలు రూ.35 కలిపి రూ.235 ముందుగానే వసూలు చేసేవారు. కానీ కార్డులు మాత్రం ఇళ్లకు వచ్చేవి కావు. ఆ తర్వాత 2023 నుంచి వాహనదారుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయడం మానేసి, కార్డులు జారీ చేయడం కూడా మానేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాగానే 2024 అక్టోబర్ 1 నుంచి మళ్లీ ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ కార్డులు మాత్రం ఇవ్వడం లేదు.

క్యూఆర్ కోడ్ జారీ ఇలా
చిప్ తో కూడిన కార్డుకు 115 రూపాయలు ఖర్చవుతుంటే క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డుకు 72 రూపాయలే ఖర్చవుతోంది. దీంతో పాటు చిప్ కార్డుల్లో డేటా రీడ్ చేయాలంటే మళ్లీ వాటికి రీడర్లు కొనాలి. క్యూఆర్ కోడ్ తో అయితే కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ తో లింక్ అయి ఉంటుంది. దీంతో క్యూఆర్ కోడ్ తో కార్డులే ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం 2024 అక్టోబర్ 1 నుంచి ఇవ్వాల్సిన కార్డుల్ని జారీ చేస్తారు. అలాగే అంతకు ముందు కార్డులు కావాలంటే తిరిగి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications