మంత్రుల పేషీల్లో ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ లు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకానికి సంబంధించిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన అంశం ప్రస్తావనకు వచ్చింది. మంత్రుల పేషీల్లో ఓఎస్డీ, పీఎస్, పీఏ పోస్టులతో పాటు కొత్తగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పేరుతో కొత్త పోస్టుని ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చ జరిగింది.
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
కేబినెట్‌లోని ప్రతి మంత్రికీ ఎంబీఏ చదివిన ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌ను పాలనా వ్యవహారాల్లో సహాయకారిగా నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రుల పేషీల్లో ఉండాల్సిన సిబ్బందికి సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉండడంతో గురువారంనాటి సమావేశంలో సంబంధిత తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు.

ప్రతీ పేషీకి 8 మంది
దీని ప్రకారం ప్రతి పేషీకి 8 మంది చొప్పున సిబ్బందిని మంజూరు చేశారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టు కూడా ఉంది. గతంలో ఈ పదవి లేదు. దీనిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఈ పోస్టును కొత్తగా సృష్టించారు. మంచివారిని చూసి పేషీల్లో సిబ్బందిగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రుల కార్యాలయాల్లో ఆరోగ్యకర వాతావరణం ఉండాలని, శాఖాపరమైన అంశాలపై వెంటనే ప్రతిస్పందించే వారిని చూసి పెట్టుకుంటే ఫలితాలు బాగా ఉంటాయని సూచించారు.
చంద్రబాబు సూచనలు
ఇదే సమయంలో మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు చేసారు. హంగు, ఆర్భాటాలు వద్దని, మనం చేసే పనుల వల్లే మనకు గుర్తింపు రావాలని సీఎం అన్నారు. ఏ అంశంలోనూ మితిమీరిన పెత్తనం వద్దని తేల్చిచెప్పారు. పరిపాలన ప్రక్రియలో మనం భాగస్వాములమే తప్ప సర్వం మనమే అన్నట్లుగా ఉండకూడదని సూచించారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు విధిగా పాల్గొనాలి ఆదేశించారు. ఫలానా వాళ్లు మనకు ఓటు వేయలేదు కాబట్టి, పింఛను ఆపేస్తామనడం వంటివి చేయవద్దని దిశానిర్దేశం చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications