జమిలి వేళ చంద్రబాబు, పవన్ బిగ్ ప్లాన్ - రోడ్ మ్యాప్ ఫిక్స్..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది. అటు కేంద్రంలో జమిలి దిశగా వేగం గా కసరత్తు కొనసాగుతోంది. దీంతో, సీఎం చంద్రబాబు .. డిప్యూటీ సీఎం పవన్ అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో తమ పట్టు కొనసాగించేలా కొత్త ప్రణాళికలతో సిద్దం అవుతున్నారు. పాలనా పరంగా - రాజకీయంగా కొత్త ఆలోచనలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా అధికార యంత్రాంగానికి రోడ్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నారు. ఈ రోజు, రేపు జరిగే కలెక్టర్ల సదస్సులో ఈ ఇద్దరు ప్రభుత్వ ప్రాధాన్యతలు.. లక్ష్యాల ను నిర్దేశించనున్నారు.
విజన్ ఆవిష్కరణ
ఏపీలో పాలనా పరంగా తమ ముద్ర చూపించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఆరు నెలల పాలన పైన సమీక్షతో పాటుగా భవిష్యత్ నిర్దేశం కోసం చంద్రబాబు - పవన్ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ రోజు, రేపు సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించటంతో పాటుగా... ప్రభుత్వం తాజా లక్ష్యాల పైన వివరించనున్నారు. ఈ సదస్సులో తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంతో పాటుగా జిల్లా - నియోజకవర్గాల విజన్ విడుదల చేయనున్నారు. ఈ విజన్ అమలు బాధ్యత కలెక్టర్లకు అప్పగించనున్నారు.

ప్రణాళికా బద్దంగా
కేంద్రంలో జమిలి దిశగా కసరత్తు జరుగుతోంది. జమిలి ఖాయమైతే ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దీంతో, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కునేలా ప్రజల్లో ప్రభుత్వం పైన సానుకూలత కోసం కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. జనవరిలో జన్మభూమి -2 తో పాటుగా కొత్త రేషన్ కార్డులు .. పెన్షన్ల మంజూరు చేసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రభుత్వం తీసుకున్న పాలనా పరమైన సంస్కరణల గురించి అవగాహన పెంచి.. వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కలెక్టర్లకు సీఎం , డిప్యూటీ సీఎం మార్గనిర్దేశం చేయనున్నారు.
మార్గనిర్దేశం
ఆర్టీజీఎస్, గ్రీవెన్స్ పరిష్కారం తో పాటుగా వార్డు, గ్రామ సచివాలయాల ప్రక్షాళన పైనా కీలక నిర్ణ యాలు ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి మద్యం, ఇసుక అంశాలు ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఉచిత ఇసుక విషయంలో కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపి స్తోంది. దీంతో పాటుగా జిల్లా ఎస్పీలకు శాంతి భద్రతల అంశంలో ప్రభుత్వం తమ ప్రాధాన్యత అంశంగా వెల్లడించనుంది. ముఖ్యమంత్రి మహిళల భద్రత పైన కఠినంగా వ్యవహరించాలని ఆదేశించనున్నారు. ఇక.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ సదస్సులో చేసే ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications