విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో మందుబాబులకు భారీ షాక్... 25 శాతం రేట్ల పెంపు.. సర్కారు ప్రకటన...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కారు... ఆ వెంటనే మద్యం అమ్మకాలను నిరుత్సాహపరిచే క్రమంలో భాగంగా రేట్లను 25 శాతం పెంచాలని నిర్ణయించడం కలకలం రేపుతోంది.

Recommended Video

Liquor: Check Out New Increased Price of Quarter Half And Full Bottles Liquor

ఏపీలో రేపటి నుంచి మద్యం దొరుకుతుందని ఆశగా ఎదురుచూస్తున్న మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మద్యం విక్రయాలను నిరుత్సాహ పరిచే క్రమంలో త్వరలో 25 శాతం రేట్లు పెరుగుతాయని ప్రకటించింది. దీంతో మందుబాబులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.

ap govt to hike liquor prices by 25 percent soon to discourage the consumption

మద్య నియంత్రణలో భారంగా ఇప్పటికే తొలి ఏడాది 20 శాతం దుకాణాలను మూసేసిన ప్రభుత్వం... అదనపు పన్నులను సైతం వడ్డించింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు కరోనా లాక్ డౌన్ నేఫథ్యంలో నష్టపోయిన మొత్తాన్ని కూడా వీరి నుంచే వసూలు చేయాలని నిర్ణయించినట్లు అర్దమవుతోంది.

రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరుస్తామని ప్రకటించిన ప్రభుత్వం... రేట్లను పెంచడం మాత్రం తథ్యమని చెబుతోంది. అలాగే మద్యం దుకాణాల వల్ల సామాజిక దూరం పాటించడంతో పాటు ఇతర ఆంక్షలను కూడా విధిస్తోంది. దీంతో మద్యం దుకాణాలకు రావాలంటేనే మందుబాబులు బెంబేలెత్తే పరిస్దితి కనిపిస్తోంది.

English summary
andhra pradesh govt to hike liquor prices by 25 percent soon. in a review meeting cm jagan orders the excise department officials to hike the liquor prices as a part of discourage the consumption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X