అనుమతుల్లోని ఇళ్లు, స్థలాల క్రమబద్దీకరణ - ఏపీ ప్రభుత్వ నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ అమలు దిశగా తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 24న జరిగే మంత్రివర్గ భేటీ ఆమోదం కోసం ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. కేబినెట్ ఆమోదంతో అమలు ప్రక్రియ ప్రారంభం కానుంది. అనుమతులు లేని భవనాలు, లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఈ నిర్ణయం వేచి చూస్తున్న వేళ.. ప్రభుత్వం అమలుకు నిర్ణయించింది.

ఏపీ ప్రభుత్వం అనుమతులకు విరుద్దంగా చేపట్టిన భవన నిర్మాణాలు.. అనుమతులు లేకుండా వేసిన లే అవుట్ల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం మరో సారి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం తో పాటుగా లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం తీసుకు రానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఈ నెల 24న జరిగే కేబినెట్ భేటీలో అమోదం తరువాత అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో, అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న నగర... పట్టణ ప్రజలకు వివిధ పథకాల ద్వారా నిర్మాణాల తో పాటుగా లేవుట్ల లోని ప్లాట్లను క్రమబద్దీకరించుకొనే అవకాశం కలుగుతుంది. 2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం ఈ పథకాలు తీసుకొచ్చింది. గడువు పూర్తి కావటంతో నిలిపివేసారు.

AP Govt to implement LRS and BPS after Cabinet approval details here

నాటి దరఖాస్తుల్లో బీపీఎస్ కు సంబంధించి 90 శాతం, ఎల్ఆర్ఎస్ లో 65 శాతం వరకు పరిష్కా రం అయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అనుమతులు తీసుకోని భవన నిర్మాణాలు.. లే అవుట్లు భారీగా వెలిసాయి. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో 123 పుర, నగరపాలక సంస్థల్లో 30,065 ఇళ్లు.. భవనాలకు ఆస్తి పన్ను విధించలేదని తేలింది.

అనుమతులు తీసుకోకుండా వేసిన లే అవుట్ల సంఖ్య 20 వేలకు పైగా ఉంటుందని అంచనా వేసారు. నెల్లూరు, చిత్తూరు, కడప, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, అనకాపల్లి జిల్లాల్లో అనుమతులు లేని లే అవుట్లు భారీగా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా వాటిల్లో ప్లాట్లు కొన్నవారు వాటిని క్రమబద్దీకరించుకొ నే అవకాశం ఉంటుంది. దీంతో, ప్రభుత్వం ఈ రెండు స్కీంల అమలుకు నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+