ఏపీలో మహిళా దినోత్సవ కానుక-ఈ 3 పథకాల ప్రారంభం..!
ఏపీలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన మూడు కీలక పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం (ap govt) సిద్దమవుతోంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఈ మూడు పథకాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో రెండు పథకాలకు ఎన్టీఆర్ పేరే పెట్టారు. మరో పథకం నేరుగా అమలు చేయబోతున్నారు. దీని వివరాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
మార్చి 8న అంతర్జాతీయ 'మహిళా దినోత్సవం' సందర్భంగా ఏపీ ప్రభుత్వం మూడు కొత్త పథకాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇందులో పిల్లల చదువుల కోసం ₹1 లక్ష వరకు పావలా వడ్డీకే రుణం ఇచ్చే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అలాగే కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం అందించే ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకంతో పాటు యానిమేటర్లకు ₹15,000 విలువైన స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా ఇచ్చే మరో పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు.

ఇప్పటికే మహిళల కోసం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉన్న స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు సాయాన్నీ అందిస్తున్నారు. వీటికి తోడు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాల్సి ఉంది. దీనికి ముందే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహిళలకు ఈ పథకాలు కూడా అమల్లోకి వస్తే నెలకు 1500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం ఒక్కటే మిగిలి ఉంటుంది.












Click it and Unblock the Notifications