వైసీపీ ముఖ్య నేతలు ఫిక్స్ - చంద్రబాబు తాజా అస్త్రం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయానికి సిద్దమయ్యారు. రాష్ట్రంలో భూ కబ్జాల ఆరోపణల పైన విచారణకు సిద్దమయ్యారు. వైసీపీ భూ కబ్జాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరగనుంది. ఈ రోజు చంద్రబాబు సమీక్షలో రెవెన్యూ శాఖ ప్రతిపాదించనుంది. ఇక సీనియర్ ఐఏఎస్, మరో సీనియర్ ఐపీఎస్ లు కమిటీలో ఉండే విధంగా ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల భూకబ్జాలపై ఆధారాలతో సహా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి.

ప్రభుత్వ ప్రతిపాదన
వైసీపీ హాయంలో నాటి అధికార పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారంటూ కొత్త ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రతీ శనివారం పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలిసేందుకు వచ్చిన వారి నుంచి ఇదే తరహాలో ఫిర్యాదులు ఉంటున్నారు. తాజాగా మదనపల్లి ఘటనలో అక్కడకు వెళ్లిన సిసోడియాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మంత్రులకు కూడా భూకబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ఉన్నత స్థాయి విచారణ జరిపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP Govt to order probe on YSRCP leader land irregularities in last five years

చంద్రబాబు సమీక్ష
విలువైన ప్రభుత్వ భూముల పరాధీనం, ప్రైవేటు భూములను ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు స్వాధీనంలో ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర హైకోర్టు సిటింగ్‌ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. కమిటీలో ఒక సీనియర్‌ ఐఏఎస్‌, సీనియర్‌ ఐపీఎస్‌ ఉండేలా కూర్పును ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఈ కమిటీ రాష్ట్రంలోని బాధితులు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్లి విన్నపాలు స్వీకరించనుంది.

వైసీపీ నేతల పై గురి
వైసీపీ నేతల భూ అక్రమాలు, పేదలపై వారు చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ ఉంటుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులకు అగంతకులు నిప్పుపెట్టారు. భూ అక్రమాలు, దందాలు బయటకు రాకుండా ఉండేందుకే కుట్రపూరితంగా సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు నిప్పుపెట్టారని రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పి.సిసోడియా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. సీఎం వద్ద జరిగే సమావేశానికి మరో నివేదికను ఆయన ఇవ్వనున్నారు. అదే సమయంలో కేసుల పరిష్కారానికి వీలుగా జోన్‌ల వారీగా క్వాజీ జ్యుడీషియల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించనున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+