కొత్త రేషన్ కార్డుల పై బిగ్ అప్డేట్ - ఏం తేల్చారు..!!

ఏపీలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేదెప్పుడు. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారనే సమాచారంతో లబ్ది దారులు కొత్తగా దరఖాస్తుకు వేచి చూస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో అప్లికేషన్లు పెట్టిన వారు సైతం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు దారులు నిరీక్షిస్తు న్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. రేషన్ కార్డుల డిజైన్లు మార్పు పై అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. మరి.. ఏపీలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ఎప్పుడు.

కొత్త కార్డులు ఎప్పుడు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు అయి ఆరు నెలలు పూర్తి కానుండటంతో కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని భావించారు. వచ్చే నెల సంక్రాంతికి కొత్త కార్డులు పంపిణీ ప్రారంభిస్తారని ప్రచారం సాగింది. మంత్రి నాదెండ్ల మనోహర సైతం పలు సందర్భాల్లో పాత కార్డులను తెలిగిస్తామని చెబుతూనే.. వాటి స్థానంలో కొత్త కార్డులను అందిస్తామని చెప్పారు. కొత్తగా ఇచ్చే డిజైన్‌పై కసరత్తు కొనసాగుతోందని వెల్లడించారు. అదే సమయంలో త్వరలోనే కొత్త కార్డులను మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారు.

AP Govt to take decision over new ration cards seem to no chance for sankranthi

డిజైన్లు సిద్దం
కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.40 లక్షల దరఖాస్తులు ఇప్పటికే కొత్త కార్డులతో పాటుగా స్ప్లిట్ , మార్పులు - చేర్పుల కోసం వేచి చూస్తున్నారు. వైసీపీ హయాంలో చివరి ఏడాదిలో కొత్త కార్డులు మంజూరు కాలేదు. ఇక, కొత్త ప్రభుత్వం సంక్రాంతికి కొత్త కార్డులు ఇస్తుందనే ప్రచారంతో లబ్దిదారులు దరఖాస్తులు చేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనికి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని అక్కడి సిబ్బంది చెబుతుండటంతో వారు వెనక్కు తిరుగుతున్నారు.

మంత్రివర్గ భేటీలో
ఇక, ఇప్పటి వరకు కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ఆప్షన్‌ కూడా ఇవ్వలేదు. ఇటు కొత్త కార్డుల డిజైన్ పైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. అయితే, కొత్త కార్డుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదికగా మారటంతో ఇప్పుడు పథకాల లబ్దిదారులు రేషన్ కార్డు పొందేందుకు వేచి చూస్తున్నారు. దీంతో, ఈ నెల 19న జరిగే మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+