పయ్యావుల సెక్యూరిటీ విత్ డ్రా - గన్ మెన్లు వెనక్కు : టీడీపీ కౌంటర్ షురూ..!!
టీడీపీ ఫైర్ బ్రాండ్ పయ్యావుల సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పయ్యావుల ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న ఒన్ ప్లస్ ఒన్ భద్రతను టు ప్లస్ టు కు పెంచాలని ఈ మధ్యనే కోరారు. అయితే, ప్రభుత్వం ఆయన గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. పయ్యావులకు సెక్యూరిటీని ప్రభుత్వం విత్ డ్రా చేసింది. పీఏసీ ఛైర్మన్ గా ఉన్న పయ్యావుల తాజాగా.. ప్రభుత్వం పైన కీలక ఆరోపణలు చేసారు.
ఒక వైపు గతంలో టీడీపీ హయాంలో పెగాసెస్.. ప్రజల వ్యక్తిగత సమాచార లీక్ వ్యవహారం పైన అసెంబ్లీ సభా సంఘం విచారణ చేస్తోంది. ప్రయివేటు వ్యక్తులకు నాటి ప్రభుత్వంలోని ముఖ్యుల సహకారంతో ప్రయివేటు వ్యక్తులకు చేరిందని సభా సంఘం ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చింది. పోలీసు - ఐటీ శాఖ అధికారుల నుంచి సమాచారం సేకరించింది. దీని పైన మరి కొంత మంది కీలక వ్యక్తులను విచారించాల్సి ఉందని కమిటీ సభ్యులు స్పష్టం చేసారు. ఇదే సమయంలో పయ్యావుల వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని ఆరోపించారు.

వైసీపీ ముఖ్యులపైన పైన నిఘా పెట్టిందంటూ విమర్శలు చేసారు. దీని కారణంగానే ఇప్పుడు పయ్యావుల గన్ మెన్లను విత్ డ్రా చేసుకున్నట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భద్రత పెంచమని కోరితే..ఉపసంహరించటం ఏంటని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నేతలు...ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు - లాప్ టాప్ లు సైతం వినియోగించాలంటే వారు భయపడుతున్నారని.. ట్యాపింగ్ చేస్తున్నారంటూ కేశవ్ ఆరోపణలు చేసారు. వీటిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. దీని పైన ఇప్పుడు టీడీపీ నేతలు సైతం కౌంటర్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.
అయితే, అనంతపురం జిల్లా పోలీసులు మాత్రం పయ్యావులకు గన్ మెన్లను తొలిగించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధంగా ఒన్ ప్లస్ ఒన్ సెక్యూరిటీ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications