అవయవ దానం చేసేవారికి రూ.లక్ష ఆర్థిక సాయం
అన్ని దానాల్లో కల్లా గొప్పది అవయవ దానం. మనం చనిపోతూ మరోకరికి ప్రాణం పోయడం అనిర్వచనీయం త్యాగం. ప్రస్తుతం యువతలో అవయవదానం పట్ల అవగాహాన బాగా పెరిగింది. అందుకు నిదర్శనమే 2025లో రికార్డు స్థాయిలో 301 అవయవాల దానం. వీటిని ఇచ్చిన వారిలో 69 మంది పురుషులు, 24 మంది మహిళలున్నారు. ఇక అవయవ దానాలను ప్రోత్సహించడంతో పాటు.. మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలబడటానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక డిమాండ్ ను సీఎం చంద్రబాబు ముందు ఉంచారు
ఏపీలో అవయవదానాలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా కిoదటెడు (2025) జనవరి నుంచి డిసెంబరు వరకు 93 మంది జీవన్మృతుల ద్వారా సేకరించిన అవయవాలను 301 మందికి అమర్చారు. తద్వారా వీరికి పునర్జన్మ లభించినట్లయింది. 2015లో 28 మంది మృతుల నుంచి సేకరించిన 91 అవయవాలను ఇతరులకు అమర్చారు. 2020లో ఇద్దరి నుంచి అవయవాలు, 2021లో 16 మంది నుంచి 67 చొప్పున సేకరించిన అవయవాలను అవసరమైన వారికి ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు.2022 లో 26 మంది నుంచి 86, 2023లో 41 మంది నుంచి 126, 2024లో 66 మంది నుంచి సేకరించిన 210 అవయవాలను తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి అమర్చారు.
ఆ ఔదార్యం ఇతరులకు స్ఫూర్తి
పుట్టెడు దుఃఖంలోనూ బాధిత కుటుంబాల వారు కనబరుస్తున్న ఔదార్యం ఇతరులకు స్ఫూర్తినిస్తోంది. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి, అవయవ దానాన్ని మరింత ప్రోత్సహించే క్రమంలోనే మంత్రి శ్రీ సత్యకుమార్ రూ లక్ష నగదు సాయాన్ని బాధిత కుటుంబాల వారికి అందచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దాతల కుటుంబాల ఆర్ధిక నేపథ్యాన్ని అనుసరించి ఒకరికి ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తే కూడా బాగుంటుందని మంత్రి అభిప్రాయపడుతున్నారు.

2020 నుంచి ఇప్పటి వరకు 244 మంది అవయవాలను దానంచేస్తే వీరిలో 69 మంది 30 ఏళ్లలోపు వారు ఉన్నారు. పదేళ్లలోపు వారు ఒకరు, 20 ఏళ్లలోపు వారు 21, 30 ఏళ్లలోపు వారు 47 మంది చొప్పున ఉన్నారు. అలాగే 40 ఏళ్లలోపు 40 మంది, 50 ఏళ్లలోపు 40మంది, ఆపై వయసు కలిగిన వారు 99 మంది చొప్పున ఉన్నారు. 244 మందిలో మహిళలు 69 మంది ఉన్నారు.
ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపిన 15 ఏళ్ల బాలుడు
కర్నూలు జిల్లా నన్నూరుకు చెందిన మద్దు కుషల్ వీర సాయికుమార్ (15) ఈనెల 02న జరిగిన ప్రమాదంలో తలలో తీవ్ర రక్తస్రావం జరగటంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆరోగ్యం క్షీణించటం తో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్య బృందం ప్రకటించిoది. కుటుంబ సభ్యుల అంగీకారంతో బాలుడి నుంచి నుంచి గుండె, ఊపిరితిత్తులు, లీవర్, కిడ్నీలు స్వీకరించారు. జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం సీనియార్టీ లిస్టును అనుసరించి గుండెను తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్ కు, ఒక కిడ్నీ, కర్నూలోని కిమ్స్ ఆస్పత్రికి, మరొక కిడ్నీను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి, లివర్ ను కర్నూల్లోని కిమ్స్ ఆస్పత్రికి, ఊపిరితిత్తులను పలు ఆసుపత్రులకు కేటాయించారు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందిస్తూ అవయవ దానానికి ముందుకు వచ్చిన బాలుడి కుటుంబ సభ్యుల స్పూర్తి ఆదర్శప్రాయమని కొనియాడారు.
అత్యధికంగా కిడ్నీల దానం
మొత్తం అవయవదానాల్లో కిడ్నీల వాటా అత్యధికంగా ఉంది. గత పదేళ్ళలో జీవన్మృతుల నుంచి 703, దాతల నుంచి 3155 కిడ్నీలు సేకరించారు. కిడ్నీల తర్వాత లివర్ మార్పిడి అవయవదానంలో రెండవ స్థానంలో ఉంది జీవన్మృతుల నుండి 316, దాతల నుంచి 50, ఊపిరితిత్తులు 180 మంది నుంచి, గుండె 91 మంది నుంచి సేకరించారు.
లక్ష రూపాయల చొప్పున
అవయవాలను దానంచేసిన జీవన్మృతుల కుటుంబాల త్యాగాన్ని గుర్తిస్తూ లక్ష రూపాయల చొప్పున అందచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు. దీనివల్ల బాధిత కుటుంబాలకు కాస్తైనా సాంత్వన చేకూరడమే కాకుండా అవయవ దానాలను మరింత ప్రోత్సహించినట్లవుతుందని వెల్లడించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు ఇప్పటికే మంత్రి శ్రీ సత్యకుమార్ చూపిన చొరవతో ప్రభుత్వ లాంఛనాలతో దాతల దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం 8.8.2024వ జారీచేసిన జీఓ 95 అనుసరించి స్థానిక జిల్లా కలెక్టర్ జాయింటు కలెక్టర్, డీఆర్ఓ ఇతర సీనియర్ అధికారుల్లో ఒకరు దాత దహన సంస్కార కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంతేకాకుండా జీవన్ దాన్ తరఫున రూ 10వేలు నగదు ఆర్థిక సాయాన్ని దాత కుటుంబానికి అందచేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications