ఆ పని మాత్రం చేయొద్దు..! ప్రైవేటు ఆస్పత్రుల్ని కోరిన ఏపీ సర్కార్ ..!
ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందిస్తున్న చికిత్సల్ని నిలిపేయాలని రాష్ట్రంలోని స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.2700 కోట్ల బకాయిలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు నెట్ వర్క్ ఆస్పత్రులకు వైద్యారోగ్యమంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక విజ్ఞప్తి చేశారు.
సీఎం చంద్రబాబుతో మాట్లాడి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల నెట్ వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాల సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. కానీ రేపటి నుంచి ఆస్పత్రుల్లో సేవల్ని ఆపొద్దని యాజమాన్యాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోచ్చే నాటికి దాదాపు రూ. 2,500 కోట్ల మేర బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయిందని ఆయన గుర్తుచేశారు.

రూ.3,800 కోట్లు నెట్ వర్క్ ఆస్పత్రులకు కూటమి ప్రభుత్వం చెల్లించిందని, రూ.670 కోట్ల వరకు అధికారులు అప్ లోడ్ చేశారని మంత్రి తెలిపారు. మరో రూ.2,000 కోట్లు స్క్రూటినీలో ఉన్నాయన్నారు. నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను నిరంతరం సంప్రదిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటున్నారన్నారు.

పేదలకు నిరంతరాయంగా ఎన్టీఆర్ వైద్య సేవలందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని గుర్తుచేశారు. కానీ బిల్లులు చెల్లించకుండా ఆస్పత్రి నడపడం అసాధ్యం అనే విషయం కూడా తమకు తెలుసన్నారు. కాబట్టే తాజాగా మరో రూ.250 కోట్లు విడుదల చేశామన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రుల సమస్యల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, అనేక కష్టాలను, ఒత్తిళ్లను తట్టుకుంటూ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి వారికి పూర్తి సహకారం ఉంటుందన్నారు. కాబట్టి సేవల్ని ఆపొద్దు అని కోరారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications