• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీ రాజధానిపై హైకోర్టు మరో ట్విస్ట్- గవర్నర్ ఆమోదించినా -మేం చూసుకుంటామని హామీ...

|

ఏపీలో ఓవైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు మూడు రాజధానుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇప్పటికే రాజధానుల ఆమోదం కోసం ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ కు పంపగా.. ఆయన న్యాయసలహా తీసుకుంటున్నారు. అదే సమయంలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ దాఖలవుతున్న పలు పిటిషన్లపై హైకోర్టు కూడా ఆసక్తికరంగా స్పందిస్తోంది. దీంతో ఈ వ్యవహారం చివరికి మరెన్ని మలుపులు తిరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా హైకోర్టు తమ తుది తీర్పుకు లోబడే అన్నీ జరుగుతాయని చెప్పడం ఈ మొత్తం వ్యవహారానికి కొత్త ట్విస్ట్ గా మారిపోయింది.

ఏపీ రాజధాని మార్పు: రంగంలోకి మోదీ! - గవర్నర్‌కు పీఎంవో కాల్?.. ఇటు హైకోర్టూ కీలక ఆదేశాలు..

 మరింత సంక్లిష్టంగా రాజధాని వ్యవహారం..

మరింత సంక్లిష్టంగా రాజధాని వ్యవహారం..

ఏపీ రాజధాని వ్యవహారం రోజుకో ట్విస్ట్ తో ఉత్కంఠ భరితంగా మారిపోతోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదించి మండలితో సంబంధం లేకుండా గవర్నర్ కు పంపింది. దీనిపై గవర్నర్ ఇప్పటికే ఓసారి న్యాయశాఖ నుంచి క్లారిటీ తీసుకున్నారు. మరోసారి కేంద్ర హోం, న్యాయశాఖలను సంప్రదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాజధాని బిల్లులను గవర్నర్ ఎక్కడ ఆమోదించేస్తారో అన్న భయాలతో అమరావతి రైతులతో పాటు పలువురు రాజకీయ నేతలు హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఒక్క వ్యవహారంపైనే హైకోర్టులో 32 పిటిషన్లు దాఖలయ్యాయంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఈ పిటిషన్లు అన్నింటిలో ఎన్నో సంక్లిష్టతలు ఉండటం, వీటిలో ప్రతీ ఒక్క అంశంపైనా ప్రభుత్వం కౌంటర్లు వేయాల్సిన పరిస్ధితి ఉండటంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

 హైకోర్టు తాజా ట్విస్ట్...

హైకోర్టు తాజా ట్విస్ట్...

అమరావతి రాజధాని వ్యవహారంలో ఇన్నాళ్లూ దాఖలైన కేసులు, హైకోర్టు స్పందన ఓ ఎత్తయితే ... తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తుగా మారాయి. అమరావతి రాజధాని పురోగతిపై మరిన్ని వివరాలు కోరిన హైకోర్టు ఇందుకోసం ఎంత ఖర్చు చేశారని కూడా ప్రశ్నించింది. తదుపరి విచారణ ఆగస్టు 6కు వాయిదా వేసింది. దీనిపై స్పందించిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆ లోపు బిల్లులు గవర్నర్ ఆమోదం కూడా పొందేలా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అలా జరిగితే ఏదైనా న్యాయసమీక్షకు కట్టుబడే ఉంటుందని, అలాంటి పరిస్దితే వస్తే తాము చూసుకుంటామన్నారు. దీంతో తమ తుది తీర్పుకు లోబడే రాజధాని బిల్లుల భవిష్యత్తు ఉంటుందని చెప్పినట్లయింది.

 గవర్నర్ ఆమోదించినా హైకోర్టులో...

గవర్నర్ ఆమోదించినా హైకోర్టులో...

హైకోర్టు తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులను ఒకవేళ గవర్నర్ ఆమోదించినా హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నందున ఈ వ్యవహారం ముందుకు సాగే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం శాసన ప్రక్రియ ద్వారా మాత్రమే రాజధాని మార్పు చేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఇప్పుడు గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదం సందర్భంగా కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాబట్టి శాసన ప్రక్రియలో లోపాలపై హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తితే మాత్రం ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు. అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

  YSRCP MLA Ambati Rambabu Tested COVID-19 Positive,Video Gone Viral || Oneindia Telugu
   అంతిమంగా కేంద్రం చేతుల్లోకి...

  అంతిమంగా కేంద్రం చేతుల్లోకి...

  రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఎన్ని చెప్పినా ఓసారి ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెడితే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా వైసీపీ సర్కారు అనుకున్నది అనుకున్నట్లు సాగాలంటే అంతిమంగా కేంద్రం జోక్యం తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది. అంటే ఓసారి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వ్యవహారమని, ఇందులో జోక్యం చేసుకోబోమని కేంద్రం హైకోర్టుకు స్పష్టం చేస్తే చాలు ఇక తర్వాత పరిణామాలు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోవచ్చనే వాదన ఉంది. అందుకే సీఎం జగన్ కూడా మూడు రాజధానులపై ధీమాగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ తరఫున జీవీఎల్ నరసింహారావు, సునీల్ దియోధర్ వంటి వారు రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కేంద్రం తరఫున కూడా కౌంటర్ దాఖలు చేస్తే ఏపీ రాజధాని ట్విస్టులకు శుభం కార్డు పడొచ్చని తెలుస్తోంది.

  English summary
  andhra pradesh high court assures amaravati farmers to take care of everything if three capital bills approved before their final verdict. and asked to submit more details and join accountant general also as a respondent.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X