చంద్రబాబుకు బిగ్ షాక్, క్వాష్ కొట్టివేత - వాట్ నెక్స్ట్..!!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరో షాక్. క్వాష్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏపీ హైకోర్టు(AP High Court) స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెలువరించింది. ఈ పిటీషన్ పైన నాలుగు రోజుల క్రితమే హైకోర్టులో హోరా హోరీగా వాదనలు జరిగాయి. ఈ తీర్పు కోసమే అటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు(Chandra Babu) కస్టడీ పిటీషన్ పైన తీర్పు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఇప్పుడు చంద్రబాబు హైకోర్టులో డివిజన్ బెంచ్ లేదా సుప్రీంను ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.
క్వాష్ పిటీషన్ పై : రాజకీయంగా ఉత్కంఠకు కారణమైన చంద్రబాబు(Chandra Babu) క్వాష్ పిటీషన్ పైన హైకోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా(Luthra) హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు పై సీఐడీ నమోదు చేసిన స్కిల్ స్కాం(Skill Scam)లో అసలు వాస్తవాలు లేవని..అదే సమయంలో పూర్తి ఆధారాల తోనే కేసు నమోదు చేసామని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ఇరు పక్షాల తరఫున మొత్తం ఐదుగురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పలు కీలక అంశాలను న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ పైన ప్రధానంగా ప్రశ్నించారు.

హోరా హోరీ వాదనలు : ఎన్నికల వేళ కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని హైకోర్టు(AP High Court) దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఫిర్యాదే ఓ అభూత కల్పన అని, ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్ధంగా ఉందంటూ తమ వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ(Rohtgi) వాదించారు. సీఆర్పీసీ 17ఏ పై వాదనలు వినిపించారు. ఏ గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడుతో పాటు చంబునాథ్ మిశ్రా కేసులో తీర్పులను ముకుల్ రోహత్గీ వివరించారు. ఈ దశలో నిందితుడికి అనుకూలంగా హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని కోరారు. ఎఫ్ఐఆర్ ఎన్ సైక్లోపీడియా కాదని చెప్పారు. 17A చంద్రబాబుకి వర్తించదని రోహిత్గి వాదించారు. కేసులో విచారణ పూర్తి కాకుండానే కోర్టులు ఇన్వాల్వ్ అవ్వకూడదని సీఐడీ (CID)తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
వాట్ నెక్స్ట్ : చంద్రబాబు(Chandra Babu) క్వాష్ కు అనర్హుడని తన వాదనల్లో రోహిత్గీ పేర్కొన్నారు. 6 షెల్ కంపెనీలకు డబ్బులు తరలించి విత్ డ్రా చేశారని వివరించారు. రేర్ కేసులో మాత్రమే కోర్టులు ఇన్వాల్వ్ అవ్వాలన్నారు. ఇలాంటి అవినీతి కేసులో కాదు. పిటిషన్ ను డిస్మిస్ చెయ్యాలని కోరారు. అసలు స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం ఎలా జరిగిందో కోర్టుకి వివరించారు. అటు ఏసీబీ కోర్టులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ (CID)దాఖలు చేసిన పిటీషన్ పైన కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. హైకోర్టులో క్వాష్ పిటీషన్ పైన తీర్పు వచ్చిన తరువాత జడ్జిమెంట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వివరించారు. ఇప్పుడు హైకోర్టులో తీర్పు రావటంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications