ఏపీలో సచివాలయాలపై నీలి నీడలు ?అధికారాల బదిలీపై హైకోర్టు ఫైర్-జగన్‌తో పోలిక
ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్ధ అమల్లో ఉండగా.. పంచాయతీల్ని కాదని సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సమాంతర వ్యవస్ధ ఏర్పాటు ఎందుకని ప్రశ్నించింది. నవరత్నాల్ని పంచాయతీలతోనే అమలు చేయించ వచ్చు కదా అని ప్రశ్నించింది. ముఖ్యంగా సర్పంచ్‌ల అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమైంది. హైకోర్టు తాజా అభ్యంతరాలతో సచివాలయపై నీలినీడలు కమ్ముకున్నాయి.

సచివాలయాలపై హైకోర్టు సీరియస్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన గ్రామ సచివాలయాలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వ్యవస్ధ అమల్లో ఉండగా.. సచివాలయాల పేరుతో మరో వ్యవస్ధ అవసరమా అని ప్రశ్నించింది. తాజాగా గ్రామ సర్పంచ్‌ల అధికారాల్ని వీఆర్వోలకు బదలాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో సచివాలయాల ఏర్పాటు పంచాయతీ చట్టానికి వ్యతిరేకంగా జరిగిందా అన్న ప్రశ్నలు తలెత్తాయి.

సమాంతర వ్యవస్ధపై హైకోర్టు ప్రశ్నలు
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌ల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన జీవో 2ని రద్దుచేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ టి.కృష్ణమోహన్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్ధ అమల్లో ఉండగా.. ప్రభుత్వం సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. సమాంతర వ్యవస్ధ ఎందుకని ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సర్పంచ్‌ల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది.

సర్పంచ్‌ల అధికారాలు లాక్కోవడమే
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం... ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకే గ్రామ సచివాలయాలు, వీఆర్వో వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. సర్పంచ్, కార్యదర్శుల అధికారాలకు ఎలాంటి ఆటంకం లేదన్నారు.
దీంతో స్పందించిన న్యాయమూర్తి... నవరత్నాలను గ్రామ పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించారు. పంచాయతీలకు నిధుల కేటాయింపు పెంచి, మౌలిక సదుపాయాలు
Recommended Video

జగన్‌కు సర్పంచ్‌లతో పోలిక
గతంలో పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శుల అధికారాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు తాజాగా ఇచ్చిన జీవో 2 విరుద్ధంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో పంచాయతీలకు సర్పంచ్ అలాగే అధిపతి అని న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. కాబట్టి సర్పంచ్‌ల వ్యవస్ధను చక్కదిద్దేలా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. ఈ కేసులో వాదనలు పూర్తికావడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనుంది.












Click it and Unblock the Notifications