హైకోర్టులో మూడు రాజధానుల విచారణ ప్రారంభం-అంతలోనే బ్రేక్-ఏం జరిగిందంటే ?

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై దాఖలైన పిటిషన్ల విచారణ మరోసార సస్పెన్స్ లో పడింది. దాదాపు వందకు పైగా పిటిషన్లపై విచారణ ఇవాళ్టి నుంచి రెగ్యులర్ గా కొనసాగేందుకు వీలుగా పుల్ బెంచ్ ను కూడా హైకోర్టు నియమించింది. దీంతో ఇవాళ్టి నుంచి రాజధాని పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుందని భావించినా చివరి నిమషంలో దానికి బ్రేక్ పడింది. ఇందుకు వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం విశేషం.

 మూడు రాజధానుల వ్యవహారం

మూడు రాజధానుల వ్యవహారం

ఏపీలో మూడు రాజధానులకు ఏ నిమిషంలో అయితే నిర్ణయం తీసుకున్నారో కానీ అప్పటి నుంచీ అన్నీ సమస్యలే. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని శాసన, కార్యనిర్వాహక వ్యవస్దలు ఆమోదించినా న్యాయ వ్యవస్ధలో మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీంతో రాజధానులపై ప్రభుత్వం ముందడుగు వేయలేని పరిస్దితి. అమరావతి నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ విశాఖ, కర్నూలుకు తరలించలేని పరిస్దితి. దీంతో ప్రభుత్వం కూడా హైకోర్టులో జరుగుతున్న విచారణ త్వరగా పూర్తయి క్లియరెన్స్ దొరుకుతందని ఆశాభావంగా ఉంది.

 హైకోర్టులో విచారణ పునఃప్రారంభం

హైకోర్టులో విచారణ పునఃప్రారంభం

ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. గతంలో అప్పటి ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలోని ఫుల్ బెంచ్ రాజధానిపై దాఖలైన దాదాపు వందకు పైగా పిటిషన్లపై సీరియస్ గా విచారణ జరుపుతున్న తరుణంలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. సీజే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ కావడంతో రాజధాని పిటిషన్ల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ఇవాళ మరోసారి ప్రస్తుత సీజే అరూప్ గోస్వామి ఆధ్వర్యంలోని ఫుల్ బెంచ్ ఈ కేసుల విచారణను పునఃప్రారంభించింది. కాబట్టి ఇకపై రాజధాని పిటిషన్లపై రెగ్యులర్ విచారణ జరిగిపోతుందని భావిస్తున్న తరుణంలో మరోసారి దీనికి బ్రేక్ పడింది.

 విచారణకు కోవిడ్ అడ్డంకులు

విచారణకు కోవిడ్ అడ్డంకులు

మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నిర్వహించే కీలకమైన విచారణకు కోవిడ్ అడ్డంకిగా మారింది. కరోనా ప్రభావం పెరుగుతున్న దశలో ఈ పిటిషన్లపై రెగ్యులర్ విచారణకు న్యాయవాదులు అభ్యంతరాలు తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణ రెగ్యులర్ గా జరిగితే రోజూ హైకోర్టుకు హాజరుకావాల్సి వస్తుందని, ప్రస్తుత పరిస్దితుల్లో అది సాధ్యం కాదని న్యాయస్ధానం దృష్టికి తెచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా తమ న్యాయవాదులతో హైకోర్టే దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పించింది. హైకోర్టు కూడా చేసేది లేక ఈ పిటిషన్ల విచారణను ఇప్పుడు కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదు.

 నవంబర్ 15కు విచారణ వాయిదా

నవంబర్ 15కు విచారణ వాయిదా

దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్దితులు, ధర్డ్ వేవ్ హెచ్చరికలు, ఇతర పరిస్ధితుల్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు మూడు రాజధానుల పిటిషన్లపై విచారణను నవంబర్ 15కు వాయిదా వేసేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా హైకోర్టు నిర్ణయంతో రాజధాని కేసుల విచారణ మరో మూడు నెలల పాటు జరిగే అవకాశం లేకుండా పోయింది. కరోనా పరిస్ధితులు కావడంతో అటు ప్రభుత్వం కానీ, న్యాయవాదులు కానీ, హైకోర్టు కానీ ముందుకు సాగే పరిస్ధితులు లేకపోవడం దీనికి కారణమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+