జగన్‌ కేసుల ఉపసంహరణపై హైకోర్టులో ట్విస్ట్- కీలకంగా అడ్మిన్‌ కమిటీ నివేదిక

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై గత టీడీపీ హయాంలో దాఖలైన 11 క్రిమినల్‌ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. మొన్న పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ కన్నెగంటి లలిత నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వాలని నిర్ణయించినా ఆఖరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

సీఎం జగన్‌పై దాఖలైన కేసుల విచారణను ఉపసంహరించుకుంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ రిజిస్ట్రార్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో సుమోటో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని భావించినా అడ్వకేట్‌ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం అడ్డుపడ్డారు. దీంతో హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయిస్తూ విచారణ వాయిదా వేసింది.

ap high court seek administrative committee report over withdrawal of jagans cases

జగన్‌పై కేసుల ఉపసంహరణకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అడ్మిన్‌ కమిటీ ఓ నివేదిక రూపొందించి హైకోర్టుకు ఇవ్వాలని జస్టిస్ లలిత ధర్మాసనం సూచించింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో అడ్మిన్‌ రిపోర్ట్‌ కీలకంగా మారింది. అడ్మిన్ రిపోర్ట్‌లో ఇచ్చే విషయాల ఆధారంగా హైకోర్టు తదుపరి విచారణ కొనసాగించబోతోంది. హైకోర్టు సుమోటో విచారణపై అడ్వకేట్ జనరల్‌ లేవనెత్తిన అభ్యంతరాలతో ఈ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+