ఏపీ సర్కార్ తో కేంద్రం కుమ్మక్కు ? హైకోర్టు అసహనం-తామే రంగంలోకి దిగుతామని హెచ్చరిక

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సత్సంబంధాలు నెరుపుతోంది. పలు విషయాల్లో ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు మాత్రమే తమ మధ్య ఉన్నాయని ఇరువురూ చెప్పుకుంటున్నారు కూడా. అయితే ఓ కీలక అంశంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం వారిని చిక్కుల్లోకి నెట్టింది. వీరిద్దరూ కుమ్మక్కయ్యారని అనుమానాలు వ్యక్తం చేసిన రాష్ట్ర హైకోర్టు.. తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది.

 రుషికొండ తవ్వకాల కేసు

రుషికొండ తవ్వకాల కేసు

ఏపీలోని విశాఖ జిల్లాలో రుషికొండ తవ్వకాల వ్యవహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఏపీలో విపక్షాలు ఎప్పటినుంచో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు గతంలో కీలక ఆదేశాలు జారీచేసింది. వీటి అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై హైకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

 విచారణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు

విచారణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు

రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి తవ్వకాలు చేపట్టిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు అధికారులతో కమిటీని నియమించి దర్యాప్తు చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ, మైనింగ్ శాఖలకు చెందిన ఐదుగురు అధికారుల్ని నియమించాల్సి ఉండగా.. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముగ్గురు అధికారుల్ని కలిపి కమిటీని నియమించింది. దీనిపై గత విచారణలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమీక్షించి కేంద్ర అధికారులే ఉండేలా చూడాలని ఆదేశించింది.

 సమర్ధించుకున్న కేంద్రం

సమర్ధించుకున్న కేంద్రం

అయితే కేంద్రం తమ చర్యను సమర్ధించుకుంది. రుషికొండ తవ్వకాలపై విచారణ కోసం నియమించిన కమిటీలో ఏపీ ప్రభుత్వానికి చెందిన అధికారుల్ని నియమించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. దీనిపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విచారణ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండాల్సిన అవసరాన్ని ఇందులో గుర్తుచేసింది. తద్వారా తమ నిర్ణయం సరేనదేనన్న వాదన వినిపించింది. అయితే ఇందులో పిటిషనర్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వద్దని ముందునుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైకోర్టు కూడా ఇవాళ ఇదే అంశంపై తీవ్రంగా స్పందించింది.

 రాష్ట్రంతో కేంద్రం కుమ్మక్కైందన్న హైకోర్టు

రాష్ట్రంతో కేంద్రం కుమ్మక్కైందన్న హైకోర్టు

రుషికొండ తవ్వకాలపై వాస్తవాలు నిర్ధారించేందుకు కేంద్రం నియమించిన విచారణ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని చేర్చడాన్ని సమర్ధించుకోవడంపై హైకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నియామకాలు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల తరపు లాయర్లు కేఎస్ మూర్తి, అశ్వినీకుమార్ గతంలో అభ్యంతరం తెలిపారు. దీన్ని హైకోర్టు ప్రస్తావించింది. పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లు కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇవాళ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులకు ఆదేశాలు ఇచ్చింది.

 తామే కమిటీ వేస్తామన్న హైకోర్టు

తామే కమిటీ వేస్తామన్న హైకోర్టు

రుషికొండ తవ్వకాలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం.. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై రేపు ఉదయం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ తీరు నేపథ్యంలో తామే స్వయంగా రుషికొండ తవ్వకాలపై విచార కోసం కమిటీని నియమించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే మరోసారి విచారణ తర్వాత దీనిపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకోబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+