చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో అనూహ్య పరిణామం..!!

చంద్రబాబు కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు(Chandra Babu) స్కిల్ స్కాం కేసులో హైకోర్టు ఈ మధ్నాహ్నం తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈ పిటీషన్ పైన చంద్రబాబు తరపున హరీష్ సాల్వే..సీఐడీ తరపున ముఖుల్ రోహిత్గీ నాలుగు రోజుల క్రితమే వాదనలు పూర్తి చేసారు. ఇటు ఏసీబీ కోర్టు(ACB Court)లో సీఐడీ కోరిన విధంగా చంద్రబాబు కస్టడీకి సంబంధించి తీర్పు ఇచ్చే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటీషన్(Squash Petition) తీర్పు అంశం కీలకంగా మారింది.

నేడే హైకోర్టు తీర్పు : చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటీషన్ ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు(Chandra Babu) రిమాండ్ పొడిగింపు పైన న్యాయమూర్తి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారణ చేసారు. విచారణకు హాజరైన చంద్రబాబు తనకు ఈ కేసులో ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. ఇది రిమాండ్ మాత్రమేనని నేరం చేసినట్లు ఇంకా రుజువు కాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

AP High court to pronounce judgement on Chanra Babus skill Scam Squash petition today, becomes crucial

మరో రెండు రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో సీఐడీ(CID) కోరిన విధంగా కస్టడీ పిటీషన్ పైన తీర్పు కు సిద్దం అవుతున్న సమయంలో హైకోర్టులో క్వాష్ పిటీషన్ పైన తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయవాదులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సమాచారం ఇచ్చారు. దీంతో, హైకోర్టు తీర్పు తరువాత మధ్నాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు కస్టడీ పిటీషన్ పైన తీర్పు వెల్లడించనుంది.

క్వాష్ పిటీషన్ లో వాదనలు : చంద్రబాబు కేసులో ఈ రోజు కీలకం కానుంది. చంద్రబాబు పైన నమోదు చేసిన కేసు..రిమాండ్ రిపోర్టు(Remand Report)ను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ లో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ పిటీషన్ విచారణ సమయంలో చంద్రబాబు తరుపున న్యాయవాదులు లూధ్రా(Luthra)తో పాటుగా హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.

ఎఫ్ఐఆర్ తో పాటుగా గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయటం సరి కాదని వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే ఈ కేసు..అరెస్ట్ చోటు చేసుకున్నాయని వాదించారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లుగా ఎక్కడా ఆధారాలు చూపలేదని వాదించారు. గతంలో ఇదే తరహా సెక్షన్ల కేసుల్లో హైకోర్టు(High Court) ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తావించారు. వీటిని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు కేసును క్వాష్ చేయాలని కోరారు.

AP High court to pronounce judgement on Chanra Babus skill Scam Squash petition today, becomes crucial

కోర్టు తీర్పుపై ఉత్కంఠ : చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలతో సీఐడీ(CID) తరపు న్యాయవాదులు ముఖుల్ రోహిత్గీ, ఏఏజీ సుధాకర్ రెడ్డి విభేదించారు. సెక్షన్ 319 ప్రకారం విచారణ సంస్థ ఎన్నిసార్లు అయినా ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది.. ఎంం మందిని అయినా విచారణ చేయవచ్చని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా ప్రక్రియ జరగలేదని వాదించారు.

రూ 371 కోట్లు ప్రజాధనం అనుయాయులతో పక్క దోవ పట్టించారని ఆరోపించారు. చంద్రబాబు(Chandra Babu) తరపు న్యాయవాదలు ప్రస్తావించిన 17ఏ గురించి వివరణ ఇచ్చారు. చంద్రబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రమేనని..చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ కు సమాచారం ఇచ్చామని వివరించారు. ఇక, ఇప్పుడు హైకోర్టులో చంద్రబాబు కేసులో క్వాష్ పిటీషన్ పైన తీర్పు మొత్తం వ్యవహారంలో కీలకంగా మారనుండటంతో తీర్పు పైన ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+