ఉండవల్లి పిల్ పై హైకోర్టులో ట్విస్ట్ ! సీజే బెంచ్ నాట్ బిఫోర్ మీ-మరో బెంచ్ కు మార్పు..!

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తాజా పరిణామాల నేపథ్యంలో సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలుచేసిన పిల్ పై హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ పిటిషన్ పై విచారణకు సిద్దమైన ఛీఫ్ జస్టిస్ బెంచ్.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

 undavalli arun kumar

రాష్ట్రంలో చోటు చేసుకున్నస్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సీబీఐతో దర్యాప్తు జరిపిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావని అంతకు ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణకు సిద్ధమైన ఛీఫ్ జస్టిస్ బెంచ్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. తమ బెంచ్ లో ఒకరు ఈ పిటిషన్ విచారించేందుకు ఇష్టం లేదని, కాబట్టి నాట్ బిఫోర్ మీ ఆప్షన్ ద్వారా మరో బెంచ్ కు దీన్ని బదిలీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

తాజా పరిణామంతో ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పై హైకోర్టులో మరో బెంచ్ విచారణ జరపబోతోంది. ముందుగా ఉండవల్లి పిటిషన్ విచారణార్హతను తేల్చనున్న ధర్మాసనం.. విచారణ జరిపేందుకు అర్హత ఉందని తేలితే ముందడుగు వేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో తదుపరి బెంచ్ విచారణ కూడా కీలకంగా మారబోతోంది. ఉండవల్లి పిటిషన్ కు విచారణ అర్హత ఉంటే హైకోర్టులో చంద్రబాబుకు మరిన్ని తిప్పలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. అదే సమయంలో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే చంద్రబాబు లాయర్లు కూడా ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+