వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ నేత పట్టాభికి బెయిల్ - మంజూరు చేసిన హైకోర్టు : న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు అయింది. గ్రడ్స్ వ్యవహారంపై మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి పైన కేసు నమోదైంది. విజయవాడ గవర్నర్ పేటో నమోదైన కేసు ఆధారంగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసారు. ముఖ్యమంత్రి పైన ఉద్దేశ పూర్వకంగానే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసారని..దీని కారణంగా కులాల మధ్య వైషమ్యాలు...సమాజంలో అలజడికి ప్రయత్నం చేసారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన పట్టాభిని పోలీసులు గురువారం విజయవాడలోని మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో హాజరు పర్చారు.

సీఎం పై అనుచిత వ్యాఖ్యల కేసులో

సీఎం పై అనుచిత వ్యాఖ్యల కేసులో


కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో..ఆయన్ను తొలుత మచిలీపట్నం జైలుకు...శుక్రవారం ఉదయం రాజమండ్రి జైలుకు తరలించారు. దీని పైన పట్టాభి తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణించిన హై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టాభి ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేయటంతో..ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు విజయవాడలోని ఆయన నివాసం తో పాటుగా టీడీపీ సెంట్రల్ ఆఫీసు పైన దాడికి దిగారు.

రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా

రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా


ఫర్నీచర్ ధ్వంసం చేసారు. పట్టాభి వ్యాఖ్యల పైన అధికార - ప్రతిపక్షాల మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. తీవ్రంగా హెచ్చరికలు చేసుకొనే వరకూ వెళ్లాయి. ఇక, టీడీపీ కార్యాలయం పై దాడికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేసారు. ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్రపతికి ఏపీలో పరిణామాలను వివరించేందుకు వెళ్తున్నారు. ఇక, ఏపీ హైకోర్టులో పట్టాభి బెయిల్ పిటీషన్ పైన వాదనలు జరిగాయి. కింది కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయించింది. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

రూల్ ఆఫ్ లా పాటించాలన్న కోర్టు.

రూల్ ఆఫ్ లా పాటించాలన్న కోర్టు.

పట్టాభికి బెయిల్ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. రెండు వైపుల నుంచి లాయర్లు వాద ప్రతివాదనలు వినిపించారు. పట్టాభి చేసిన విమర్శల సీడీలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. రూల్ ఆఫ్ లా పాటించాలని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రోసీజర్ ఫాలో కాకుండా అరెస్టు చేశారని అభిప్రాయం వ్యక్తం చేసింది. పోలీసులు దూకుడు తగ్గించుకోవాలన్న కోర్టు సూచించింది. థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎలా రిమాండ్ ఇచ్చారో చెప్పాని హైకోర్టు వివరణ కోరింది.

English summary
TDP leader Pattabhi was granted bail by AP high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X