వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చినరాజప్ప బాటలోనే సుచరిత... పవర్ లెస్ హోమ్ మినిస్టర్స్ !

|
Google Oneindia TeluguNews

విభజన తర్వాత ఏపీకి తొలి మహిళా హోంమంత్రిగా అవకాశం దక్కించుకున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తన పదవిలో అసౌకర్యంగా కనిపిస్తున్నారు. హోంశాఖలో తనకున్న అధికారాలను సైతం వాడుకునేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతోంది. తన శాఖలో ఉద్యోగుల బదిలీలు కూడా చేయించుకోలేకపోవడం చూస్తుంటే మాజీ హోంమంత్రి చినరాజప్ప బాటలోనే సుచరిత కూడా పయనిస్తున్నట్లు అర్ధమవుతోంది.

 తొలిసారి మహిళా హోంమంత్రిగా

తొలిసారి మహిళా హోంమంత్రిగా

గతంలో 2004లో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిని తన కేబినెట్ లో హోంమంత్రిగా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన అడుగు జాడల్లోనే వైఎస్ జగన్ కూడా తొలిసారి అధికారంలోకి రాగానే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి రెండోసారి గెలిచిన సుచరితకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ఏపీలోనూ లేని విధంగా తొలిసారి దళిత మహిళకు జగన్ హోంమంత్రిగా అవకాశం ఇవ్వడం ద్వారా చరిత్ర సృష్టించారు. అయితే జగన్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్ధాయిలో సద్వినియోగం చేసుకునే పరిస్ధితుల్లో సుచరిత ఉన్నారా అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

 హోంశాఖపై పట్టులేకపోవడంతో...

హోంశాఖపై పట్టులేకపోవడంతో...

హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 9 నెలలు పూర్తవుతున్నా సుచరిత మాత్రం తన శాఖపై పట్టు పెంచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అధికారుల బదిలీలతో పాటు శాఖా వ్యవహారాలను సైతం హోంశాఖ కార్యదర్శితో పాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ ఛీఫ్ చూసుకోవాల్సిన పరిస్ధితి. తన శాఖలో పెండింగ్ లో ఉన్న కేసులేంటి, గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన కేసులేంటి, అధికారం చేపట్టాక వాటిని పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలేంటో ఓసారి గమనిస్తే సుచరిత పనితీరు అర్ధమవుతుంది. దీంతో సహజంగానే తరచూ పోలీసు శాఖలో అధికారుల మార్పులు జరుగుతూనే ఉన్నాయి. వీటిలోనూ సుచరిత మార్కు ఇప్పటివరకూ కనిపించలేదు.

 చినరాజప్ప బాటలోనే సుచరిత..

చినరాజప్ప బాటలోనే సుచరిత..

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిమ్మకాయల చినరాజప్ప హోంమంత్రిగా ఉండేవారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శల విషయంలో కానీ, రాష్ట్రంలో నేరాలపై కానీ, అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు కానీ చినరాజప్ప స్పందన చూస్తే ఆయనకు తన శాఖపై ఉన్న పట్టు ఏమిటో ఇట్టే అర్ధమైపోయేది. చివరికి సొంత జిల్లాలో కానిస్టేబుల్ బదిలీ కూడా చేయించుకోలేని హోంమంత్రి అంటూ ఆయనపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి సుచరిత పరిస్ధితి కూడా దాదాపు ఇలాగే ఉంది. సొంత శాఖలో అధికారుల బదిలీలే కాదు, ఇతరత్రా వ్యవహారాల్లోనూ సుచరిత దూకుడుగా వ్యవహరించలేక పోతున్నారు.

Recommended Video

చంద్రబాబు గాలి తీసిన హోం మినిస్టర్ ! || Home Minister Sucharitha On Chandrababu Naidu Security
 అలంకార ప్రాయంగా హోంమంత్రి పదవి

అలంకార ప్రాయంగా హోంమంత్రి పదవి

కేవలం సుచరిత, చినరాజప్పే కాదు, గతంలో సబితా ఇంద్రారెడ్డి లాంటి వారు కూడా పేరుకే పదవుల్లో ఉండేవారు. కేవలం ప్రోటోకాల్ అందుకోవడం మినహా హోంమంత్రులుగా చురుగ్గా వ్యవహరించలేని పరిస్ధితి వీరిది. ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవారు వీరికి స్వేచ్చ ఇవ్వకపోవడం ఓ ఎత్తయితే ఈ విషయాన్ని ముందే గ్రహించి తన శాఖపై పట్టు పెంచుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం మరో ఎత్తు. దీంతో ఏపీలో హోంమంత్రి పదవులు అలంకార ప్రాయంగా మారిపోతున్నాయి. దీంతో అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను లెక్క చేయడం లేదు. చివరికి పరిస్ధితి ముదిరినప్పుడు ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని అధికారులను బదిలీ చేయాల్సిన పరిస్దితి తలెత్తుతోంది. ప్రస్తుతం సుచరిత వ్యవహారాన్ని గమనిస్తే గత హోంమంత్రులకు ఈమెకు పెద్దగా వ్యత్యాసం లేదని తెలుస్తోంది.

English summary
AP Home Minister Mekathoti Suchariata is not in a Position to Utilize Her powers. She's Following the Footsteps of her predecessor Chinarajappa. Home Minister Can't involve in Departmental Transfers also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X