ఏపీలో ఓ వీఐపీకి త్వరలో ఐటీ నోటీసులు, 2 వేల కోట్ల బ్లాక్ మనీ కేసులో..

ఏపీలో గత నెలలో జరిపిన ఐటీ సోదాల్లో బయటపడిన రూ.2 వేల కోట్ల లావాదేవీలకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న ఐటీ అధికారులు తాజాగా కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ను ఓసారి విచారించారు. మరోసారి రావాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే క్రమంలో ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఐటీ సోదాలకు కొనసాగింపుగా ఓ వీఐపీని విచారణకు రావాలని నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలిసింది.

ఏపీలో ఐటీ దాడులు పార్ట్ 2

ఏపీలో ఐటీ దాడులు పార్ట్ 2

తెలుగు రాష్ట్రాల్లో గత నెలలో జరిపిన ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్ల మేర అక్రమ లావాదేవీలను గుర్తించిన అధికారులు ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గుజరాత్ లో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ను కూడా పిలిపించి విచారించిన ఐటీ అధికారులు, మరోసారి ఆయన్ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశాయి. దీంతో రూ.2 వేల కోట్ల హవాలా లావాదేవీల వ్యవహారంలో విచారణ మరింత మందుకు వెళ్లబోతోంది.

సీన్ కట్ చేస్తే తాజాగా రెండు రోజుల క్రితం నుంచి తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే కార్పోరేట్ కళాశాలల క్యాంపస్ లపై ఐటీ బృందాలు విరుచుకుపడుతున్నాయి. వీటిలో కీలక ఆధారాలను, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వీటిలో దొరికిన ఆధారాలను గత నెలలో జరిగిన దర్యాప్తుకు లింక్ చేసి ఓ వీఐపీకి త్వరలో ఐటీ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ, గుజరాత్ లో కీలక ఆధారాల సేకరణ

ఏపీ, గుజరాత్ లో కీలక ఆధారాల సేకరణ

గతేడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలోని ఓ రాజకీయ పార్టీ నుంచి జాతీయ స్ధాయిలో మరో రాజకీయ పార్టీకి భారీగా నిధులు వెళ్లాయని అనుమానిస్తున్న అధికారులు ఈ కోణంలో ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఏపీలో ఓ ఇన్ ఫ్రా సంస్ధ నుంచి అందిన ముడుపులతో పాటు మరో మూడు ఇన్ ఫ్రా సంస్ధల ద్వారా సదరు జాతీయ పార్టీకి నిధులు అందాయని భావిస్తున్న ఐటీ అధికారులు ఆ దిశగా మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. గుజరాత్ కు చెందిన అహ్మద్ పటేల్ కు హవాలా వ్యాపారి మొయిన్ ఖురేషీతో సంబంధాలు ఉండటంతో ఆయన ఏపీలోని రాజకీయ పార్టీ నుంచి జాతీయ స్ధాయి రాజకీయ పార్టీకి ఎన్నికల నిధులు సమకూర్చారనేది ప్రధాన అభియోగం.

గత నెలలో ఐటీ సోదాలతో కదిలిన డొంక

గత నెలలో ఐటీ సోదాలతో కదిలిన డొంక

వాస్తవానికి అమరావతిలో తాత్కాలిక సచివాలయంతో పాటు పలు కీలక నిర్మాణాల కోసం రూ. 2652 కోట్ల విలువైన పనులకు ఢిల్లీకి చెందిన ఓ ఇన్ ఫ్రా సంస్ధ కాంట్రాక్టులు తీసుకుంది. ఈ సంస్ధ నుంచి అందిన ముడుపులనే హవాలా మార్గంలో జాతీయ పార్టీకి ఎన్నికల సందర్భంగా అందించినట్లు తొలుత భావించినా తెలుగు రాష్ట్రాల్లో జరిపిన విస్తృత సోదాల్లో ఈ వ్యవహారం రూ.150 కోట్లకే పరిమితం కాలేదని, రూ.2 వేల కోట్ల మేర అక్రమ లావాదేవీల కోసం భారీగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తేలింది. దీంతో అధికారులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో షెల్ కంపెనీల ద్వారా ప్రతీ రోజూ కొన్ని కోట్ల రూపాయల డబ్బు వివిధ మార్గాల్లో జాతీయ పార్టీకి చేరిందని అనుమానిస్తున్నారు.

 ఏపీ వీఐపీకి త్వరలో నోటీసులు

ఏపీ వీఐపీకి త్వరలో నోటీసులు

ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ తో పాటు టీడీపీ ముఖ్యనేతలను టార్గెట్ చేసుకుని చేసిన దాడుల్లో రూ.2 వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను గుర్తించిన అధికారులు.. ఈ వ్యవహారంలో ఓ వీఐపీని విచారణకు పిలిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించిన సదరు వీఐపీకి తెలియకుండా ఈ లావాదేవీలేవీ జరిగే అవకాశం లేదని గుర్తించిన ఐటీ అధికారులు.. త్వరలో ఆయన్ను పిలిపించి విచారించేందుకు సిద్దమవుతున్నారు. అదే జరిగితే ఏపీలో రాజకీయంగానూ కలకలం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+