ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకూ ఇంప్రూవ్‌మెంట్, వీరికే ఛాన్స్..!?
ఏపీ ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్. సెకండ్ ఇయర్ విద్యార్ధుల కోసం బోర్డు కీలక ప్రతిపాదన పైన కసరత్తు చేస్తోంది. కొత్తగా సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఇంప్రూవ్ మెంట్ అవకాశం కల్పించే విధంగా చర్చలు సాగుతున్నాయి. ఇక.. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను అధికారికంగా ప్రకటించింది. అదే విధంగా వచ్చిన మార్కులపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థులకు లేదా కొద్ది మార్కులతో ఫెయిల్ అయిన వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది. ఫీజులు.. పరీక్షల తేదీలను వెల్లడించింది.
ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రతిపాదన పరిశీలన చేస్తోంది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం మార్కుల మెరుగుకు ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు మొదటి సంవత్సరం విద్యార్ధులకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఈ సారి సెకండ్ ఇయర్ విద్యార్ధులకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు తుది చర్చల తరువాత నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక.. ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై... జూన్ 11 వరకు ఉంటాయి. ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే వారికి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7, 2026వ తేదీ నుంచి జూన్ 11, 2026వ తేదీ వరకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు.

ఇంటర్మీడియట్ బోర్దు కసరత్తు
ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై... జూన్ 11 వరకు ఉంటాయి. ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే వారికి ఇంటర్ ప్రాక్టిలక్ పరీక్షలు జూన్ 7, 2026వ తేదీ నుంచి జూన్ 11, 2026వ తేదీ వరకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. సెకండ్ ఇయర్ విద్యార్ధులు ఎవరైనా ప్రాక్టికల్స్, సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ రాయాలంటే తొలుత సాధించిన మార్కులను రద్దు చేసుకోవల్సి ఉంటుంది.
కాగా, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు ఇంప్రూవ్ మెంట్, రీ వెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లింపులు ఏప్రిల్ 20, 2026వ తేదీ న ఉంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. విద్యార్దులు ఈ వారం రోజుల వ్యవధిలో ఫీజులు చెల్లించాలి. మార్కుల లెక్కింపులో పొరపాట్లు ఉన్నాయని భావిస్తే రీకౌంటింగ్ కు, సమాధాన పత్రాలను మళ్లీ సరిచూడాలని అనుకుంటే రీవెరిఫికేషన్ కు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications