వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ పరీక్షల ఫీవర్: విద్యార్థుల హడావిడి, టెన్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బుధవారంనాటి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్-1 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. 19,78,379 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 2661 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనుంది.

కాగా ఈ పరీక్షల్లో తొలిసారిగా నిమిషం ఆలస్యం నిబంధనలను ప్రవేశపెట్టారు. ఉదయం 8:45 గంటలలోగా విద్యార్థులు పరీక్షాకేంద్రాల్లో ఉండాలని, లేదంటే పరీక్షకు అనుమతివ్వబోమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 వరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగనుంది.

AP Intermediate Board Examination 2014 begin March 12

ఈనెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ దాకా పరీక్షలు జరుగనున్నాయి. గురువారం సెకండియర్‌లో సెకండ్‌లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షను 79,860 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షలు సజావుగా జరగడానికి వీలుగా జిల్లా కలెక్టర్ ఎంకే మీనా నేతృత్వంలోని హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇందులో కలెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా వృత్తి విద్యాధికారి(డీవీఈవో), సీనియర్‌ప్రిన్సిపాల్ సభ్యుడిగా ఉంటారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాళ్లు, ఇద్దరు లెక్చరర్లు సభ్యులుగా జిల్లా పరీక్షల కమిటీ పరీక్షలను పర్యవేక్షించనుంది.

మాస్‌కాపీయింగ్‌ను నివారించడానికి ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు పెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ఆబిడ్స్ గన్‌ఫౌండ్రీలోని మహెబూబియా బాలికల పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఆర్ఐవో కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. 040-2323 6433, 2324 1530 నెంబర్‌లకు ఫోన్ చేసి, తల్లిదండ్రులు , విద్యార్థులు సహాయం పొందవచ్చు. ఇంటర్‌పరీక్షల కోసంప్రత్యేక బస్సులు నడుపుతామని ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించింది.

English summary
Intermediate exams have been started in Andhra Pradesh today state wide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X