AP IPL:సీఎం జగన్ "మెగా" స్కెచ్, ఏపీ నుంచి ఐపీఎల్ టీం - అంబానీ సైతం..!!
సీఎం జగన్ మెగా స్కెచ్ తో సిద్దం అవుతున్నారు. సంక్షేమం..రాజకీయం గురించి నిత్యం మాట్లాడే సీఎం జగన్ తాజాగా చేసిన ఒక ప్రతిపాదన ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ నుంచి ఐపీఎల్ టీం తీసుకు రావాలనేది సీఎం జగన్ ప్లాన్. దీని వెనుక భారీ కసరత్తు తరువాతనే ఈ ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఐపీఎల్ టీం పైన చర్చల సమయంలో అనూహ్యంగా హీరో రాం చరణ్ పేరు తెర మీదకు వచ్చింది. రాం చరణ్ కొత్తగా ఐపీఎల్ టీం ఏర్పాటుకు సిద్దమవుతున్నారని సమాచారం.
క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చే వార్త : ఏపీలో క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చే వార్త ఈ మధ్య సీఎం జగన్ చెప్పారు. ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ మూమూలుగా లేదు. ఇప్పటి వరకు తెలుగ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ పేరుతో సన్ రైజర్స్ ఒక్కటే ఐపీఎల్ లో కొనసాగుతోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీమ్ ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ దిశగా కీలక ప్రతిపాదనలతో సిద్దం అవుతున్నారు. రాష్ట్రం నుంచి ఒక టీమ్ ఐపీఎల్లో ఉండేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని వెనుక ఒక ఆసక్తి కర చర్చ పొలిటికల్..క్రికెట్ ఫ్యాన్స్ లో మొదలైంది. మెగా హీరో రాం చరణ్ వచ్చే ఐపీఎల్ ఆక్షన్ సమయానికి ఒక టీంను కొనుగోలు చేసి ఫ్రాంచైజీగా మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ పేరుతో ఆ టీంను ఐపీఎల్ టోర్నీకి దించాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.

ఏపీ నుంచి ఐపీఎల్ టీం : ఈ చర్చ ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ఈ సమయంలోనే క్రికెటర్లు అంబటి రాయుడు తో పాటుగా సీఎస్కే మేనేజ్ మెంట్ సభ్యులు సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత కేఎస్ భరత్ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. యువతను ఆకట్టుకొనేలా క్రీడా పరమైన నిర్ణయాలు ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టీం సిద్దం చేయాలని సూచించారు. ప్రభుత్వం నేరుగా ఐపీఎల్ టీం నిర్వహించే అవకాశం లేదు. దీంతో..రాం చరణ్ తన ఐపీఎల్ టీం ఏర్పాటుకు ముందుకు వస్తే పూర్తిగా సహకరించేందుకు సీఎం జగన్ సిద్దంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సీఎస్కే, ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్లతో సీఎం జగన్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఏపీ నుంచి కొత్త ఐపీఎల్ టీం ఏర్పాటులో ఆ రెండు యాజమన్యాల సహకారం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
వైజాగ్ వారియర్స్ పేరుతో : ముంబై ఇండియన్స్, సీఎస్కే జట్ల నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ అంబటి రాయుడు సీఎం ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీం కూర్పు..ఆర్దిక వ్యవహారాలు.. నిర్వహణ వంటి వాటి పైన ప్రాజెక్టులతో సిద్దం అవుతున్నట్లు సమాచారం. రాం చరణ్ ముందుకు వస్తే పూర్తి సహకారం అందించటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని ద్వారా ఏపీకి ఐపీఎల్ టీంతో బ్రాండ్..ఇమేజ్ రెండు పెరుగుతాయని..యూత్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంబానీ తోనూ సీఎం జగన్ సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ అంశంలో సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. అనుకున్నట్లుగా అంతా సెట్ అయితే "వైజాగ్ వారియర్స్" పేరుతో ఏపీ నుంచి ఐపీఎల్ టీం రంగంలోకి దిగనుంది.












Click it and Unblock the Notifications