చినికి చినికి గాలివానగా ఏపీ ఐపీఎస్ ల మెమో వివాదం..! జగన్ సహా తెరపైకి తాజా, మాజీలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి, వైసీపీ అనుకూల ఐపీఎస్ అధికారులకూ మధ్య నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వైసీపీ అనుకూల ఐపీఎస్ లను పలువురిని బదిలీ చేయడంతో పాటు మరికొందరికి పోస్టింగ్ కు కూడా ఇవ్వకుండా వీఆర్ లో పెట్టింది. ఈ నేపథ్యంలో వీరు వైఎస్ జగన్ ను బెంగళూరు వెళ్లి కలిశారని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే వీరికి డీజీపీ ఆఫీసుకు వచ్చి వెళ్లాలని మెమోలు ఇచ్చామని చెబుతోంది.
వైసీపీకి, వైఎస్ జగన్ కు అనుకూలంగా ఉన్నారనే కారణంతో 16 మంది ఐపీఎస్ అధికారులకు కూటమి సర్కార్ పోస్టింగ్ లు నిరాకరించడం, ఆ తర్వాత ఏకంగా డీజీపీ ఆఫీసుకు రోజూ వచ్చి వెళ్లాలని మెమోలు జారీ చేయడం కలకలం రేపుతోంది. దీన్ని తప్పుబడుతూ వైసీపీతో పాటు పలువురు రిటైర్డ్ అధికారులు, తెలంగాణకు చెందిన మాజీ పోలీసు అధికారులు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇందులో స్వరణ్ జిత్ సేన్, ప్రవీణ్ కుమార్ వంటి రిటైర్డ్ అధికారులున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కౌంటర్ విమర్శలకు దిగుతున్నారు.

జగన్ తో బెంగళూరులో భేటీ కావడం వల్లే సదరు ఐపీఎస్ లకు మెమోలు జారీ చేసినట్లు నిన్న మాజీ పోలీసు అధికారి అయిన టీడీపీ నేత వర్ల రామయ్య వెల్లడించారు. అంతే కాదు వీరిపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఇవాళ మరో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు సైతం జగన్ పాలనను గుర్తుచేస్తూ గతంలో మీరు ఎల్వీ సుబ్రమణ్యం, ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఐపీఎస్ లకు డీజీపీ ఇచ్చిన మెమో ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది.
-
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications