RTI: సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు-ఇకపై ఇలా-సర్కార్ జీవో..!
సమాచార హక్కు చట్టం (RTI)ప్రకారం విధిగా ఇవ్వాల్సిన సమాచారాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తాజాగా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వీటిని రాష్ట్రాలు తప్పకుండా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరుతూ వచ్చే దరఖాస్తులు, అప్పీళ్ల నిర్వహణ విషయంలో ఆర్టీఐఎంఐఎస్ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
దీని ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లు పూర్తిగా ఆన్ లైన్లో, డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు. వీటి ప్రకారం రాష్ట్రంలో ఎవరైనా సమాచార హక్కు చట్టం ప్రకారం ఏదైనా సమాచారం కోసం దరఖాస్తు చేయాలంటే.. వెబ్ సైట్ https://rtionline.ap.gov.in లో చేసుకోవచ్చు. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చేస్తే.. ఎస్మెమ్మెస్, ఈ-మెయిల్స్ ద్వారా అప్ డేట్స్, 30 రోజుల్లో ప్రాథమిక సమాచార అధికారి (పీఐవో) నుంచి సమాధానం వస్తాయి.

దీనిపై అవసరమైతే ఫస్ట్ అప్పీలు, సెకండ్ అప్పీలు కూడా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వీటికి టైమ్ లైన్స్ కూడా ఇచ్చారు. జిల్లా నోడల్ ఆఫీసర్ అయితే 5 రోజుల్లో దరఖాస్తు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. పీఐవో అయితే 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఎఫ్ఏఏ అయితే 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. సెకండ్ అప్పీల్ విషయంలో 90 రోజుల్లో దాఖలు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల్ని ఇంటి దగ్గరి నుంచే ఆన్ లైన్ లో చేసుకోవడంతో పాటు ట్రాకింగ్, అప్పీల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications