రేవంత్ ప్రమాణస్వీకారానికి జగన్, చంద్రబాబు డుమ్మా ? కీలక కారణాలు ?

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పొరుగున ఉన్న ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు, ఇండియా కూటమి నేతలకు ఆహ్వనాలు పంపారు. కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పలువురు నేతలకు ఆహ్వనాలు వెళ్లాయి.

ap leaders ys jagan, chandrababu to skip revanth reddys oath ceremony as telangana cm

అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్ష నేత, టీడీపీ అధినేత చరేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి డుమ్మా కొడుతున్న వైఎస్ జగన్, చంద్రబాబు ఇవాళ వివిధ కార్యక్రమాల్ని షెడ్యూల్ చేసుకున్నారు. వైఎస్ జగన్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అభివృద్ధి పనుల శంఖుస్ధాపన, చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే వీరిద్దరు నేతలు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి హాజరుకాకపోవడం ఉద్దేశపూర్వకమేనా అన్న చర్చ జరుగుతోంది. దీని వెనుక ప్రధాన కారణం ఏపీ ఎన్నికలే అని తెలుస్తోంది.

రేవంత్ ప్రమాణస్వీకారానికి వెళ్తే ఇప్పటికే పరోక్షంగా మద్దతిస్తున్న బీజేపీకి కోపం వస్తుందేమోనన్నది ఓ కారణం కాగా.. రేవంత్ ప్రమాణస్వీకారానికి వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఉంటూ తెలంగాణకు మద్దతుదారులన్న ముద్ర తమకు ఎక్కడ వ్యతిరేకత తెస్తుందేమోనన్న భయం కూడా వీరిద్దరినీ వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతిచ్చింది.

ఇప్పుడు చంద్రబాబు రేవంత్ ప్రమాణస్వీకారానికి వెళ్తే ప్రధాని మోడీ సహా బీజేపీ నేతల ఆగ్రహానికి గురికావడం ఖాయంగా భావిస్తున్నారు. అలాగే తన సామాజిక వర్గమైనా రేవంత్ ప్రమాణస్వీకారానికి వెళ్తే సీఎం జగన్ పై ఎంతోకొంత కాంగ్రెస్ అనుకూల ముద్ర పడుతుంది. దీంతో వీరిద్దరూ ఈ కీలక కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు వెళ్లడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ విజయవాడలో కనకదుర్గ ఆలయంలో అభివృద్ధి పనుల శంఖుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే చంద్రబాబు ఏపీలో ఓటర్ల జాబితాలలో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ రేవంత్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదని తేలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+