జగన్ కు ప్రతిపక్ష హోదా అప్పుడే ! తేల్చేసిన పయ్యావుల కేశవ్..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత 11 సీట్లే సాధించిన వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు కూటమి సర్కార్ నిరాకరిస్తోంది. ముఖ్యంగా జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు కూటమి సర్కార్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి దీనిపై లేఖ రాసినా ప్రయోజనం లేదు. దీనిపై ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇది ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో సభా వ్యవహారాలమంత్రి పయ్యావుల ఇవాళ స్పందించారు.
వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే విషయంపై మంత్రి వయ్యావుల స్పందిస్తూ.. అందుకు పదేళ్ల సమయం పడుతుందన్నారు. ప్రజలు 11 సీట్లు అయినా ఇచ్చింది సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించమనే అని పయ్యావుల జగన్ కు గుర్తుచేశారు. కానీ సభకు రాకుండా సింగిల్ కెమెరాలు పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఉపయోగం లేదన్నారు. అభిమానించినా, అవమానించినా నిలదొక్కుకున్న వాళ్లే రాజకీయంగా ఉండగలరంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

మరోవైపు జగన్ వైఖరి ఇలాగే కొనసాగితే ఉన్న 11 మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదం ఉందని పయ్యావుల హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసిన జగన్.. కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడగటమేంటనని ప్రశ్నించారు. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీ వెళ్లి అడుగాతానంటున్నారని జగన్ ఢిల్లీ పర్యటను ఉద్దేశించి ఆక్షేపించారు.జగన్ ఢిల్లీ టూర్ పైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలోత రహస్య చర్చల కోసమే ఢిల్లీ వెళ్లానని జగన్ ధైర్యంగా చెప్పొచ్చు కదా అన్నారు.












Click it and Unblock the Notifications