Legislative Council: ఏపీ మంత్రులు వర్సెస్ మండలి ఛైర్మన్..! వెనక్కి తగ్గాల్సిందే..!

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీతో పాటు మండలిలోనూ తిరుమల లడ్డూ నెయ్యిపై చర్చకు ప్రభుత్వం బీఏసీల్లో అంగీకరించింది. దీనిపై విపక్షం లేని అసెంబ్లీలో చర్చ సజావుగానే సాగింది. అయితే మండలి (legislative council)లో మాత్రం చర్చపై మెలిక పెట్టింది. దీనిపై ప్రకటన చేస్తామంటూ నిన్న ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. దీనిపై మండలి ఛైర్మన్ అభ్యంతరం తెలిపారు. అక్కడే కీలక పరిణామాలు జరిగాయి.

లడ్డూ నెయ్యిపై ప్రకటనకు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అంగీకరించారంటూ నిన్న మండలిలో ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ ఓ పత్రాన్ని తీసుకొచ్చి చదివేందుకు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న మండలి ఛైర్మన్.. తనకు సమాచారం లేకుండా ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి తాను అనుమతించినట్లు చెప్పి ఎలా చదువుతారంటూ బ్రేక్ వేశారు. దీనిపై కాసేపు వాగ్వాదం చోటు చేసుకోవడం, మండలి వాయిదా పడటం జరిగిపోయాయి.

AP Legislative Council Chairman Asked to Withdraw Remark by Ministers

ఈ వ్యవహరంపై ఇవాళ మరోసారి మండలి ఛైర్మన్ ప్రస్తావన తెచ్చారు. నిన్న ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.. తాను అంతర్గతంగా ఇచ్చిన ఓ ఆదేశాన్ని తీసుకొచ్చి, దాన్ని ఆధారంగా చూపుతూ తాను లడ్డూ అంశంపై ప్రకటనకు అంగీకరించినట్లు చెప్పడం సరికాదని తేల్చిచెప్పేశారు. నిన్న రూల్స్ కు విరుద్ధంగా..ప్రశ్నోత్తరాలు జరిపించాలని అధికారపక్షం కోరిందని, లడ్డూపై చర్చను అడ్డుకోవాలని చూడటం విచారకరమని ఆయన తెలిపారు. మంత్రి తనపై సత్యదూరమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. అధికారపక్షం సభలో చర్చను అడ్డుకోవడం సరికాదన, తాను సంతకం చేశానని మంత్రి చెప్పడాన్నీ ఆక్షేపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+