ఏపీ శాసన మండలిలో రచ్చ రచ్చ.. ఆ విషయంపై డైలాగ్ వార్ !
ఏపీలో పొలిటికల్ హీట్ మళ్లీ మొదలైంది. అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వివిధ అంశాలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తగా, మంత్రులు సమాధానాలు ఇస్తూ సభ కొనసాగుతుంది. ఇటు శాసన మండలిలో సమావేశాలు ప్రారంభం అవ్వగా కూటమి నేతలు.. వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
మండలిలో వైసీపీ ఆందోళన..
వైసీపీ సభ్యులు యూరియా కొరత, రైతుల సమస్యలపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన తర్వాత ఏ అంశంపైనా చర్చకు సిద్ధమని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా, వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అయినా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గక ఆందోళనను కొనసాగించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నప్పటికీ సభలో గందరగోళం నెలకొంది. దీనితో మండలి సమావేశాలను ఒకసారి వాయిదా వేశారు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి.

బొత్స వ్యాఖ్యలు..
మళ్లీ సభ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, యూరియా సమస్య అత్యవసరమైందని, రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. "ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే ఆలస్యం ఎందుకు? రైతులు ఈ చర్చ కోసం ఎదురుచూస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
బీఏసీలో చర్చించిన తర్వాత యూరియా అంశాన్ని తీసుకుంటామని ఛైర్మన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఈ అంశంపై విస్తృత చర్చ ఉంటుందని ప్రకటించినా వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఫలితంగా సభలో మళ్లీ గందరగోళం నెలకొని రెండోసారి సమావేశాలను వాయిదా వేయాల్సి వచ్చింది.
ప్రభుత్వం తరఫున మంత్రులు మాట్లాడుతూ, రైతుల సమస్యలపై చర్చించేందుకు ఎలాంటి వెనుకంజ వేయబోమని అన్నారు. అవసరమైతే రాత్రంతా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ప్రతిపక్షం గందరగోళానికి పాల్పడటం వల్ల సభ సజావుగా సాగడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మళ్లీ శాసన మండలి తిరిగి ప్రారంభం అయ్యింది












Click it and Unblock the Notifications