కేంద్ర కేబినెట్ లోకి మెగా బ్రదర్ - రామ్మోహన్ శాఖ మార్పు, ముహూర్తం ఫిక్స్..!?
ఢిల్లీలో ఏపీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం ఫిబ్రవరి 1న 2025 -26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. అందులో భాగంగా మోదీ కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. కొందరు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. పార్టీ లో కొందరిని ప్రభుత్వంలోకి తీసుకునే ఆలోచన జరుగుతోంది. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. మెగా బ్రదర్ నాగబాబు కేంద్ర కేబినెట్ లోకి వస్తున్నారనే చర్చ ఢిల్లీలో జరుగుతోంది. అదే విధంగా రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు పైనా ప్రచారం సాగుతోంది.
ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. త్వరలో మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ త్వరలో కీలక రాష్ట్రాల ఎన్నికల ను ఎదుర్కోనుంది. ఈ సమయంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా బీజేపీ అగ్రనాయకత్వం మిత్రపక్షాలతో చర్చిస్తోంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండటంతో.. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. దీంతో.. ఇప్పుడు ఏపీ నుంచి కొత్తగా కేంద్రం మంత్రి అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది.

ఈ నెల 31 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ముందే ప్రధాని మోదీ తన కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తో సహా మరో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతు న్నాయి. ఈ రెండు రాష్ట్రాల కు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామైలకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది.
అదే సమయంలో ఏపీ నుంచి రెండు మిత్రపక్ష పార్టీలు ఉండగా.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా.. పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్ లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు.
కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవి పైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు - పవన్ తీసుకునే తుది నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది.

జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాగా, అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమా చారం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర.. కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. దీంతో, ప్రాంతీయ - సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.
ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పేరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా.. రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు పైన చర్చ జరుగుతోంది. రామ్మోహన్ ను విమానయానం నుంచి తప్పించి మరో కీలక శాఖ ఇస్తారని సమాచారం. దీంతో, మరో రెండు రోజుల్లో ఈ మార్పులు.. చేర్పుల పైన అధికారికంగా స్పష్టత రానుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications