వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు-కాంగ్రెస్ అనూహ్యం కాకపోయనా, ఇదీ అంతే నిజం: ఊహించని ట్విస్ట్.. బీజేపీకి అలా ఛాన్స్?

|
Google Oneindia TeluguNews

Recommended Video

2019 Elections : టీడీపీ కాంగ్రెస్ తో, పవన్ లెఫ్ట్ పార్టీలతో ?

అమరావతి: వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. ఏ పార్టీ ఏ పార్టీతో కలుస్తుందో, ఎవరు ఒంటరిగా పోటీ చేస్తారో తెలియకుండా ఉందని అంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి.

రెచ్చగొడుతావా, టీడీపీని మరిచేవారు, సినిమాల్లేని హీరోతో: బాబుకు జీవీఎల్ దిమ్మతిరిగే షాక్రెచ్చగొడుతావా, టీడీపీని మరిచేవారు, సినిమాల్లేని హీరోతో: బాబుకు జీవీఎల్ దిమ్మతిరిగే షాక్

మొన్నటి వరకు టీడీపీ-బీజేపీ దోస్తీ. గత ఏడాది కాలంగా వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య భేటీలు జరుగుతోందనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో దోస్తీ కడుతుంటే.. బీజేపీతో ఒప్పంతం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది.

 కాంగ్రెస్-టీడీపీ మధ్య ఆసక్తికర పరిణామం

కాంగ్రెస్-టీడీపీ మధ్య ఆసక్తికర పరిణామం

ఏపీలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది. ఇది అనూహ్య పరిణామానికి దారి తీసే అవకాశం లేకపోయినప్పటికీ చర్చకు మాత్రం అవకాశమిస్తోంది. అదే టీడీపీ, కాంగ్రెస్ బంధం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టుకు వచ్చింది. కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎంపీలు సోనియా గాంధీని కలవడం మొదలు, ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ ఎంపీలకు మద్దతుగా కాంగ్రెస్ నిలవడం, అది కూడా అవిశ్వాసం నోటీసు ఇవ్వడం, చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీలు పెద్దగా పాల్గొనకపోవడం చర్చకు తావిస్తోంది.

కాంగ్రెస్‌తో దోస్తీపై చంద్రబాబు

కాంగ్రెస్‌తో దోస్తీపై చంద్రబాబు

కాంగ్రెస్, టీడీపీ దోస్తీ కడతాయని ప్రచారం కూడా సాగింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ దోస్తీ కడతాయని ఇటీవల ప్రచారం సాగుతోందని, ఇలాంటి అసత్య ప్రచారాలు సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అదెంత నిజమో.. ఇదీ అంతే

అదెంత నిజమో.. ఇదీ అంతే

మరోవైపు, జనసేన, వైసీపీ, బీజేపీల పైన కూడా ఆసక్తికర ప్రచారం సాగుతోంది. తాను వామపక్షాలతో కలిసి నడుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ, ఆ నేతలతో భేటీ అవుతున్నప్పటికీ వెనుక బీజేపీ ఉందని టీడీపీ ఆరోపణలు చేయడం గమనార్హం. అంటే టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై ప్రచారం ఎంత నిజమో.. బీజేపీ-జనసేన రహస్య ఒప్పందం అంతే నిజమనే వారు లేకపోలేదు. ఎందుకంటే బీజేపీకి వామపక్షాలకు బద్ధ రాజకీయవైరం ఉంది. బీజేపీకి పవన్ దగ్గర ఉన్నాడని తెలిస్తే వారు తమ దరి చేయనీయరని గుర్తు చేస్తున్నారు.

పోటీ ఇలా ఉండే అవకాశం

పోటీ ఇలా ఉండే అవకాశం

బీజేపీ, వైసీపీల మధ్య కూడా బంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసుల కోసం వైసీపీ, తమను అణగదొక్కేందుకు బీజేపీ ఒకరికి మరొకరు మద్దతిచ్చుకుంటున్నారనేది టీడీపీ ఆరోపణ. అయితే, ఇందులో నిజానిజాలు ముందు ముందు తేలుతాయని అంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా, జనసేన-వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని భావిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ, వైసీపీ కలిసి పోటీ చేయకున్నా లోపాయకారి ఒప్పందం ఉండే అవకాశముందని అంటున్నారు.

అలా బీజేపీకి ఛాన్స్?

అలా బీజేపీకి ఛాన్స్?

ఇదిలా ఉండగా మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీలు ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి కమలం పార్టీకి లాభించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. కొన్ని వర్గాల ఓట్లు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ మధ్య చీలి అంతిమంగా అధికారం ఎవరికీ దక్కదని, అప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. అప్పుడు బీజేపీ కీలకంగా మారే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లోని ఓ రాష్ట్రంలో కేవలం రెండు స్థానాల్లో గెలుపొంది.. కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన విషయం గమనార్హం. ఏపీలోను బీజేపీ దాని కోసమే పావులు కదుపుతున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

English summary
Chandrababu Naidu's latest tirade over BJP is a strategic masterstroke to convert a threat into an opportunity. This is precisely what he did in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X