మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు - చంద్రబాబు ఛాయిస్, పవన్ సైతం..!!

ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ కీలక నిర్ణయాల దిశగా కసరత్తు జరుగుతోంది. త్వరలో మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ త్వరలో కీలక రాష్ట్రాల ఎన్నికల ను ఎదుర్కోనుంది. ఈ సమయంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా బీజేపీ అగ్రనాయకత్వం మిత్రపక్షాలతో చర్చిస్తోంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండటంతో.. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. దీంతో.. ఇప్పుడు ఏపీ నుంచి కొత్తగా కేంద్రం మంత్రి అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది.

మంత్రివర్గ ప్రక్షాళన
వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ముందే ప్రధాని మోదీ తన కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనుండగా.. ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోనూ ఎన్నికలకు సమయం సమీపి స్తోంది. దీంతో.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతు న్నాయి. ఈ రెండు రాష్ట్రాల కు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామైలకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. అదే సమయంలో ఏపీ నుంచి రెండు మిత్రపక్ష పార్టీలు ఉండగా.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు.

ap-may-get-another-berth-in-modi-cabinet-as-reshuffle-in-next-month

ఏపీకి మరో పదవి
ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా.. పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్ లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవి పైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు - పవన్ తీసుకునే తుది నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి.

దక్కేది ఎవరికి
కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. పవన్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాగా, అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమా చారం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర.. కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. దీంతో, ప్రాంతీయ - సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకా శం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో, నంద్యాల ఎంపీ పేరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ ఏపీ పర్యటన తరువాత.. చంద్రబాబు - పవన్ ఏపీ నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇవ్వాలి.. తద్వారా ఏపీ కేబినెట్ లో నాగబాబు ఎంట్రీ.. మార్పుల గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+