'వైసీపీని అందుకే వీడాం','నన్ను ఏడిపించాలని చూశారు'

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్:వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తాము చెప్పిన విషయాలను పట్టించుకొనేవాడు కాదని ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చేసిన సూచనలను ఆయన పట్టించుకొనేవాడు కాదన్నారు.ఈ కారణాలతోనే తనతో పాటు భూమా నాగిరెడ్డి వైసీపీ నుండి టిడిపిలో చేరినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు.

భూమా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆళ్ళగడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, టిడిపి నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి చేసిన సేవలను వారు గుర్తు చేసుకొన్నారు.

భూమా నాగిరెడ్డి వర్ధంతి సభలో నాగిరెడ్డిని గుర్తు చేసుకొని మంత్రి అఖిలప్రియ భావోద్వేగానికి గురయ్యారు. భూమా ఆశయాల సాధన కోసం తాము కట్టుబడి ఉన్నామని వారు ప్రకటించారు.

వైసీపీని వీడడానికి కారణమిదే

వైసీపీని వీడడానికి కారణమిదే

వైసీపీ చీఫ్ జగన్ ఎవరూ చెప్పినా విన్పించుకొనేవాడు కాదని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. పార్టీ కోసం తాము చెప్పిన సూచలను వినేవాడు కాదన్నారు. పార్టీ కోసం తనతో పాటు భూమా నాగిరెడ్డి పలు మార్లు చేసిన సూచనలను జగన్ పట్టించుకోలేదని ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు. జగన్‌ను నెత్తిన పెట్టుకొని పూజించాలనుకొన్నామని, కానీ, ఆయన తమను కాదనుకొన్నారని ఆదినారాయణరెడ్డి చెప్పారు.

బావోద్వేగానికి గురైన అఖిలప్రియ

బావోద్వేగానికి గురైన అఖిలప్రియ

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిని గుర్తుచేసుకొని మంత్రి అఖిలప్రియ భావోద్వేగానికి గురయ్యారు.తమ తల్లిదండ్రులు తనను ఏనాడూ ఏడిపించలేదని, నంద్యాల ఉపఎన్నికల సమయంలో మాత్రం కొందరు తనను ఏడిపించే ప్రయత్నం చేశారని వాపోయారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా అఖిలప్రియ అన్నారు.

భూమా సేవలే ఉప ఎన్నికల్లో గెలిపించాయి

భూమా సేవలే ఉప ఎన్నికల్లో గెలిపించాయి

భూమా నాగిరెడ్డి దంపతులు ప్రజలకు చేసిన సేవలే నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిని గెలిపించాయని మంత్రి కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. భూమా దంపతులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రయత్నించనున్నట్టు మంత్రి హమీ ఇచ్చారు.

 జగన్‌కు సీఎం కుర్చీపైనే ధ్యాస

జగన్‌కు సీఎం కుర్చీపైనే ధ్యాస


వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కు సీఎం కుర్చీపైనే ధ్యాస ఉందని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు బుద్ది చెప్పారని మంంత్రి ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap minister Adinarayana Reddy made allegations on Ysrcp chief Ys Jagan on Sunday. minister participated in Bhuma Nagireddy first anniversary held at Allagadda on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి