బాబును అంతం చేసే కుట్ర, నాపై జగన్‌తో సహ ఎవరైనా పోటీ చేయండి: ఆది సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అంతం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కుట్ర చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు చంద్రబాబునాయుడు చనిపోవాలని జగన్ కోరుకొంటున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.

  YS Jagan on Paradise Papers leak:ఇలాంటి cm ఉంటే ఎంత ఊడితే ఎంత? 15రోజుల టైమిస్తున్నా| Oneindia Telugu

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌‌పై ప్యారడైజ్ పేపర్లలో పేరుందని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని జగన్ కూడ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు.విదేశాల్లో తనకు ఆస్తులున్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు.

  వైఎస్ జగన్ సవాల్‌పై టిడిపి నేతలు కూడ ఘాటుగానే స్పందిస్తున్నారు. మంత్రులు కళా వెంకట్రావు, సోమిరె్డ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు కూడ జగన్‌ వ్యాఖ్యలపై స్పందించారు.బుదవారం రాత్రి మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు.

   జగన్‌పై ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  జగన్‌పై ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  ముఖ్యమంత్రి పీఠం కోసమే చంద్రబాబు చనిపోవాలని జగన్ కోరుకుంటున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ఈ కారణంగానే నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా సీఎంను నడిరోడ్డుపై కాల్చి చంపాలని జగన్ నీచమైన భాషను ఉపయోగించారని ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు.. జగన్‌ తీవ్రవాద ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు

   ఆ వ్యాఖ్యలు జగన్ అవివేకానికి నిదర్శనం

  ఆ వ్యాఖ్యలు జగన్ అవివేకానికి నిదర్శనం

  దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి, అక్రమాస్తులు పోగేసిన ప్రముఖులపై ప్యారడైజ్‌ పేపర్స్‌లో వచ్చిన కథనాన్ని ముఖ్యమంత్రి రాయించారనడం జగన్‌ అవివేకానికి నిదర్శనమని మంత్రి ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ వార్తలు అవాస్తవాలైతే న్యాయపోరాటం చేయాలని మంత్రి ఆదినారాయణరెడ్డి జగన్‌కు సూచించారు. ప్యారడైజ్ పేపరల్లో అమితాబ్‌, కార్తీ చిదంబరం వంటివారి ప్రస్తావనా ఉందని కూడ మంత్రి గుర్తు చేశారు.

   పాదయాత్ర మద్యలోనే జైలుకు జగన్

  పాదయాత్ర మద్యలోనే జైలుకు జగన్

  గుంటూరులో వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో చంద్రబాబు 2019 ఎన్నికల్లోగా చనిపోతారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే.. జగన నవ్వారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.పాదయాత్రలోనే జగన్‌ జైలు యాత్ర చేయడం ఖాయమన్నారు. జగన్ జైలులో ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు.

   ఉప ఎన్నికలకు సిద్దం

  ఉప ఎన్నికలకు సిద్దం

  వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తనతో పాటు 22మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తే.. ఉప ఎన్నికలకు సిద్ధమని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే తాము సీఎంకు రాజీనామాలు అందజేశామన్నారు. తన రాజీనామా ఆమోదించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. తనపై జగన్‌ గానీ, ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీ చేయాలని సవాల్‌ చేశారు. కొడుకు తప్పు చేస్తుంటే మంచి చెప్పాల్సి పోయి, సమర్థించడం జగన్‌ తల్లి విజయలక్ష్మికే చెల్లించదన్నారు. దొంగల్లో నంబర్‌వన్‌ అయిన కొడుకును సీఎం కావాలని ఆశీర్వదించడం విడ్దూరంగా ఉందన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ap minister Adinarayana Reddy sensational comments on to Ysrcp chief Ys Jagan on Wednesday.He spoke to media on Wednesday night at Amaravati.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి