కాపుల్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టలేవు-కేసులు ఎత్తేసింది మేమే- పవన్ పై అంబటి కామెంట్స్..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏ చిన్న సందర్భం దొరికినా ప్రత్యర్ధుల్ని ఆటాడుకోవాలని నేతలు భావిస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న విజయవాడ కోర్టు... గతంలో చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న తుని ఘటన నుంచి కాపు నేతల్ని విముక్తి చేస్తూ ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి అంబటి ఇవాళ చంద్రబాబు, పవన్ ను టార్గెట్ చేశారు.

కాపులపై కేసులు పెట్టింది టీడీపీ అయితే ఎత్తివేసింది వైఎస్ఆర్సీపీ అని మంత్రి అంబటి గుర్తుచేశారు. కాపులను సర్వనాశనం చేయడమే టీడీపీ లక్ష్యమన్నారు. రాజకీయ కుట్రతోనే తుని ఘటనలో కాపు నేతలపై కేసులు పెట్టారని అంబటి ఆరోపించారు.
ముద్రగడ పద్మనాభాన్ని హింసించి పైశాచిక ఆనందం పొందిన సైకో చంద్రబాబు అన్నారు. కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు దొడ్లో కట్టేయాలన్నదే పవన్ కల్యాణ్ లక్ష్యమన్నారు.

ambati rambabu blames chandrababu and pawan kalyans cheating

సినిమాను అమ్మేసినట్టుగా కాపుల్ని అమ్మేయాలంటే కుదరదు పవన్ కల్యాణ్ అని మంత్రి అంబటి తెలిపారు. టీ-కాఫీ అలవాటు లేని వంగవీటి రంగాకు టీ ఇచ్చానని చెప్పే అజ్ఞాని పవన్ కల్యాణ్ అని విమర్శించారు. పవన్ కలిసినా చంద్రబాబుతో కాపులు కలవరని అంబటి చెప్పుకొచ్చారు. రాజకీయ కుట్రతోనే తుని ఘటనలో కేసులు పెట్టారని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని బీసీల్లో చేరుస్తామని హామీనిచ్చి విఫలమవుతున్న దశలో ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో పెద్ద ఎత్తున్న కాపు ఉద్యమం జరిగిందన్నారు.

పవన్‌కళ్యాణ్‌ వెళ్లి చంద్రబాబును కలిసి మాట్లాడతాడని, చంద్రబాబు కూడా పవన్‌ దగ్గరకు వెళ్తాడని అంబటి తెలిపారు. మీరిద్దరూ కలిసి తిరిగితే తమకేం అభ్యంతరం లేదన్నారు. మీరు కలిస్తే కలవండి గానీ చంద్రబాబు వలన ఇంత హింసకు గురైన కాపులు మాత్రం మీతో కలవరు గాక కలిసే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. పవన్‌కళ్యాణ్‌ పిలుపునివ్వగానే కాపులంతా చంద్రబాబు పల్లకి మోస్తారని అనుకుంటూ భ్రమల్లో బతుకుతున్నారు గానీ.. తెలుగుదేశం పార్టీ పుట్టుక దగ్గర్నుంచి కాపుల్ని నాశనం చేయడానికే రాజకీయం చేస్తుందని కాపులెప్పుడో గుర్తించారని అంబటి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+