వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: నేనే హోంమంత్రినైతే, మంత్రిపదవిని వదులుకొంటా, ప్రజలే తరిమికొడతారు

తాను నిజాన్ని నిర్భయంగా చెప్పేందుకుగాను అవసరమైతే మంత్రిపదవిని కూడ వదులుకొనేందుకు సిద్దంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: తాను నిజాన్ని నిర్భయంగా చెప్పేందుకుగాను అవసరమైతే మంత్రిపదవిని కూడ వదులుకొనేందుకు సిద్దంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు చెప్పారు.

విశాఖ నగరంలో జరిగిన భూ కుంభకోణంపై మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించాడు. నర్సీపట్నంలో జరిగిన నవనిర్మాణదీక్షలో ఆయన శనివారం నాడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రాష్ట్ర అభివృద్దికి సహకరించాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్దికి ఏ విధంగా సాధ్యమౌతోందని ఆయన ప్రశ్నించారు. విభజన జరిగిన తర్వాత రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా అభివృద్దికి ఎటువంటి ఆటకం లేకుండా సీఎం చంద్రబాబునాయుడు నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు.

తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతానని చెప్పారు. అయితే దీనివల్ల ఎలాంటి నష్టం జరిగిన తాను వెనుకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు అయ్యన్నపాత్రుడు.విశాఖపట్టణంలో చోటుచేసుకొన్న భూ కుంభకోణంపై అయ్యన్నపాత్రుడు సీరియస్ గానే స్పందిస్తున్నారు.

భూకుంభకోణాలకు పాల్పడినవారిని ప్రజలు తన్నితరిమికొట్టేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు.అదే విధంగా ఏజెన్సీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం నుండి అధికంగా జీతాలు తీసుకొంటున్న విధులకు ఎగనామం పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

మంత్రిపదవిని వదులుకొంటా

మంత్రిపదవిని వదులుకొంటా

నిజాలను మాట్లాడుతానని మరోసారి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు నిజాలను మాట్లాడినందుకుగాను అవసరమైతే మంత్రిపదవిని కూడ వదలుకొనేందుకు కూడ సిద్దమేనని చెప్పారు.అయితే విశాఖపట్టణంలో చోటుచేసుకొన్న భూకుంభకోణంపై ఆయన మరోసారి స్పందించారు. భూ కుంభకోణానికి పాల్పడినవారిని ప్రజలు విశాఖనుండి తరిమికొట్టేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు.

వడ్డీవ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయులు

వడ్డీవ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయులు

ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులు విధులకు ఎగనామం పెట్టి నర్సీపట్నంలో వడ్డీవ్యాపారం చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రభుత్వం నుండి అధిక వేతనాలు తీసుకొంటున్న ఉద్యోగులు ఈ రకంగా వ్యవహరించడం సరికాదన్నారు అయ్యన్నపాత్రుడు.

నేను హోంమంత్రినైతే భూకబ్జాదారుల తొక్కతీస్తా

నేను హోంమంత్రినైతే భూకబ్జాదారుల తొక్కతీస్తా

తాను హోంమంత్రినైతే విశాఖ జిల్లాలో భూకబ్జాదారుల తొక్కతీస్తానని బిజెపి శాసనసభపక్షనాయకుడు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. విశాఖ భీమిలి చుట్టూనే భూదందా పతాకస్థాయికి చేరుకొందన్నారు.భీమిలి ల్యాండ్ పూలింగ్ తో పాటు జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలు, రికార్డుల ట్యాంపరింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు.తనవద్ద పక్కా ఆధారాలు లేవు కాబట్టి పేర్లు బయటపెట్టడం లేదన్నారు.

మంచిపార్టీ ఏర్పాటైతే రాజకీయాల్లోకి వస్తా

మంచిపార్టీ ఏర్పాటైతే రాజకీయాల్లోకి వస్తా

రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని మరోసారి సినీ నటుడు సుమన్ వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ అస్వస్థతకు గురయ్యాడు.ఆయనను పలాసలో సుమన్ పరామర్శించారు. రాష్ట్రంలో మంచి పార్టీ వస్తే అందులో చేరి రాజకీయంగా ప్రజలకు సేవచేస్తానని సుమన్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణ ఉద్యమానికి సహకరించాడు.

English summary
Andhra pradesh Roads and buildings minister Chintakayala Ayyanna patrudu sensational comments on officers and political leaders in Navanirmana dheeksha at Narsipatnam on Saturday. I spoke facts only said minister Ayyanna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X