జబర్థస్త్‌లో డ్యాన్స్‌లు, ఆమె ఓ తింగరబుచ్చి: రోజాపై అయ్యన్న సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం: ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై నిప్పులు చెరిగారు. ఆమె ఓ తింగరబుచ్చి అంటూ అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు. రోజా మాటలను ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదన్నారు.

'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా శనివారం విశాఖపట్టణం జిల్లా చీడికాడలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చీఫ్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్న రోజా వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు.

Ap minister Ayyannapatrudu slams on Ysrcp MLA Roja

జబర్దస్త్‌లో డాన్సులు చేసే తింగరబుచ్చికి ఏమీ తెలియదని అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని ఆమె తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఆమె చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి చెప్పారు.

వైసీపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ నాయకులు కూడా అడ్డగోలుగా చౌకబారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అయ్యన్న ఎద్దేవా చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap minister Ayyannapatrudu made allegations on Ysrcp MLA Roja at Vishakapatnam. Minister participated Intintiki Tdp programme in Chidikada village on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి