వల్లభనేని వంశీ అరెస్టు అందుకే-అసలు కారణం చెప్పిన మంత్రి..!
ఏపీలో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై దుమారం రేగుతోంది. వంశీ గత ప్రభుత్వంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయన్న టార్గెట్ చేశారన్న విమర్శలు ఓవైపు వినిపిస్తుండగా.. మరోవైపు ఆయన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసులో ఫిర్యాదు దారును కిడ్నాప్ చేసి బెదిరించినందుకే అరెస్టు చేసామంటూ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ మంత్రి ఒకరు అసలు కారణం చెప్పారు.
దళితుడిని బెదిరించడం వల్లే వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్లు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో అమలవుతోంది అసలైన రాజ్యాంగమని వెల్లడించారు. వంశీని కక్షసాధింపుతో వేధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. తప్పు చేసినందుకే పోలీసులు అతన్ని అరెస్టు చేశారని, కక్షసాధించాలంటే ఎనిమిది నెలలు ఆగాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్టు చేసే వాళ్లమన్నారు.

ఇప్పటికే మరో మంత్రి నారా లోకేష్ సైతం వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించారు. గతంలో ఆయన చేసిన తప్పిదాలకు ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటోందని ఇప్పటికే వెల్లడించారు. అందులో తన తల్లిని దూషించిన వ్యవహారమా లేక గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారమా అనేది లోకేష్ చెప్పలేదు. ఇప్పుడు మంత్రి స్వామి మాత్రం గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనపై ఫిర్యాదు దారు అయిన సత్యవర్ధన్ ను బెదిరించిన వ్యవహారంలోనే వంశీ అరెస్టు అయినట్లు తేల్చిచెప్పేశారు.












Click it and Unblock the Notifications