కరెంటు ఛార్జీల పెంపు..! మండలిలో సర్కార్ క్లారిటీ...!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీల్ని తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత వాటిని తగ్గించకపోగా పెంచుతూ పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ శాసన మండలిలో ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. పెంచిన కరెంటు ఛార్జీల్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి వారికి సమాధానం ఇచ్చారు.

ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కరెంటు ఛార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు నిలదీశారు.సర్దుబాటు ఛార్జీల పేరుతో 15 వేల కోట్ల భారం మోపారని ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇలాగే 20 వేల కోట్లు సర్దుబాటు ఛార్జీలు విధించి వెళ్లిపోతే వైసీపీ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. రేట్లు పెంచకుండా ట్రూఅప్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనిపై విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు.

ap minister gottipati ravi clarified on power charges hike in legislative council

Take a Poll

తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచలేదని, పెంచబోమని గొట్టిపాటి రవి స్పష్టత ఇచ్చారు. పెరిగిన చార్జీలు అన్నీ, మీ ప్రభుత్వంలో మీరు పెంచి వెళ్ళిన చార్జీలు.. మీరే పెంచి వెళ్ళిన చార్జీలపై, మీరే ఆందోళన చేయటం వింతగా ఉందని చురకలు అంటించారు. మీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకి ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే, మా ప్రభుత్వం గత 9 నెలల్లో ఆ ఖర్చుని 60 శాతం తగ్గించిందన్నారు. మనమే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి, ప్రజలపై భారం పడకుండా చూస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+