చంద్రబాబుపై జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు-నిమ్మకూరు వస్తే ఎన్టీఆర్ ను మళ్లీ చంపినట్లే..

ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కోటలు దాటిపోతోంది. ఎల్లుండి కృష్ణాజిల్లాలో టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరుకు వస్తున్న చంద్రబాబును వైసీపీ మంత్రి జోగి రమేష్ టార్గెట్ చేశారు. చంద్రబాబును నిమ్మకూరు ఎలా వస్తావని జోగి రమేష్ ప్రశ్నించారు.

 చంద్రబాబుపై జోగి రమేష్ కామెంట్స్

చంద్రబాబుపై జోగి రమేష్ కామెంట్స్

ఇవాళ కృష్ణాజిల్లా మచిలీపట్నం జడ్పీ కన్వేషన్ హాల్ లో అమ్మవడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేశారు. జిల్లా ల పర్యటన చేస్తున్న చంద్రబాబు ఒక జోకర్ లా, అయ్యన్న అండ్ కో బ్రోకర్ల లా తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. 151 మంది ఉంటే 17 మందికి మంత్రి పదవులు ఇచ్చాడు...అంతమంది కంటే ఎక్కువ మంది బిసి, ఎస్సి , మైనారిటీ లకు నువ్వు మంత్రి పదవులు ఇస్తానని ధైర్యంగా చెప్పగలవా అని చంద్రబాబును ప్రశ్నించారు.

 గుడివాడలో చర్చకు రెడీ

గుడివాడలో చర్చకు రెడీ

గుడివాడలో సామాజిక న్యాయం, సామాజిక ధర్మం పై చర్చకు నేను సిద్ధం నువ్వు రెడీనా అని చంద్రబాబుకు జోగి రమేష్ సవాల్ విసిరారు. నువ్వైనా చర్చకు రా లేదా నేనైనా రమ్మంటే నిమ్మకూరు వస్తా అని జోగి ఆఫర్ చేశారు. చవట సన్నాసిలా పరిపోవద్దన్నారు. సామాజిక న్యాయం పాటించేది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, సామాజిక సిగ్గు మానవత్వం ఉందా అని చంద్రబాబును జోగి ప్రశ్నించారు.

 నిమ్మకూరు ఎలా వస్తావ్ ?

నిమ్మకూరు ఎలా వస్తావ్ ?

తన మామ ఎన్టీఆర్ ను మానసిక క్షోభ పెట్టి చనిపోవడానికి కారణమైన వాడివి ఏ మొఖం పెట్టి నువ్వు వచ్చి విగ్రహానికి దండ వేస్తావ్ అంటూ చంద్రబాబును జోగి రమేష్ ప్రశ్నించారు. నారా చంద్రబాబును నిమ్మకూరు ప్రజలు తరిమికొట్టాలన్నారు. నువ్వు గాని నిమ్మకూరు లో బస చేస్తే మరోసారి హత్య చేసినట్లేనన్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ చావుకు కారణమైన నువ్వు ఎలా మళ్ళీ నిమ్మకూరు వస్తావ్ అని నిలదీశారు.

చంద్రబాబు-పవన్ పొత్తులపై

చంద్రబాబు-పవన్ పొత్తులపై

చంద్రబాబు తాను ఒంటరిగా పోటీ చేస్తా జగన్మోహన్ రెడ్డి ని ఒడిస్తానంటున్నాడని, పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలవా అని ఆయనకు జోగి రమేష్ సవాల్ విసిరారు. పొత్తుల కోసం అరాటపడే దుర్మార్గపు బుద్ధి నీది నువ్వా ముఖ్యమంత్రి ని విమర్శించేది చంద్రబాబేనన్నారు. జిల్లా పర్యటనకు వచ్చి అసలు ఏం చెబుతావయ్యా, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ తీసేస్తామతున్నావు డబ్బులు పేదవాడికి పంచుతున్నావు అంటున్నావు మరి అబ్బకు, కోటీశ్వరులకు డబ్బులు పంచమంటావా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+